వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కీలక బిల్లుకు సవరణ: సంతకం చేసిన బైడెన్.. ఇక కష్టంగా గన్ లైసెన్స్

|
Google Oneindia TeluguNews

అమెరికాలో తుపాకులు సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేయవచ్చు. అక్కడ స్వేచ్చ ఎక్కువే ఉంది. వర్ణ వివక్ష కలిగిన వ్యక్తులపై దాడి జరిగింది. దీనిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా పరిగణించారు. తుపాకుల వినియోగంపై ఆంక్షలు విధించే కీలక బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దశాబ్దాల నుంచి విస్తృతమైన తుపాకీ హింస నుంచి ప్రజలను కాపాడేందుకు ఈ బిల్లు మేలు చేస్తోందని బైడెన్ భావిస్తున్నారు.

ప్రజల ప్రాణాలకు భరోసా లభిస్తుందని వైట్ హౌస్‌లో బైడెన్ కామెంట్ చేశారు. బాధితుల వేదన తమను ఏదో ఒకటి చేయాలనే దిశగా నడిపించిందని, ఇవాళ ఆ పని పూర్తి చేశామని వెల్లడించారు. ఈ బిల్లుకు గురువారం సెనేట్ లో ఆమోదం లభించగా, ప్రతినిధుల సభలో శుక్రవారం ఆమోద ముద్ర పడింది. యూరప్ లో రెండ్రోజుల పర్యటనకు వెళ్లేముందు బైడెన్ ఈ బిల్లును సమీక్షించి సంతకం చేశారు.

US President Joe Biden signs landmark gun control law

బిల్లు చట్టరూపంలో అమల్లోకి వస్తే... బాలలు తుపాకులు కొనుగోలు చేయడంపై నిశితంగా దృష్టిసారించేందుకు వీలు కల్పిస్తుంది. పిన్న వయసు తుపాకీ కొనుగోలుదార్ల నేపథ్యం గురించిన తనిఖీలు మరింత కఠినతరం చేయడం ఈ బిల్లుతో సాధ్యమవుతుంది. ప్రమాదకరమైన వ్యక్తులుగా గుర్తించిన వారి నుంచి తుపాకులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకునే వెసులుబాటు కలిగిస్తుంది. గృహ హింస నేరాలకు పాల్పడిన వారు ఇకపై తుపాకులు పొందడం కష్టసాధ్యంగా మారనుంది. కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు దోహదపడుతుంది.

English summary
US President Joe Biden on Saturday signed the most sweeping gun violence bill in decades, a bipartisan compromise that seemed unimaginable until a recent series of mass shootings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X