• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అండర్‌గ్రౌండ్‌లో ట్రంప్: రక్షణ కోసం బంకర్‌లో: మెలానియా సహా: ఆంటిఫాపై ఉగ్రముద్ర: అనూహ్యంగా

|

వాషింగ్టన్: అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలోని పలు నగరాలు అగ్నిగుండాలుగా తయారయ్యాయి. ఆ దేశంలో నివసించే ఆఫ్రికన్ అమెరికన్లందరూ ఏకం అయ్యారు. వ్యతిరేక ప్రదర్శనలు, నిరసనలతో అట్టుడికిస్తున్నారు.

  అట్టుడుకుతున్న అమెరికా.. అండర్‌గ్రౌండ్‌లో ట్రంప్!

  చైనాతో ఫేస్ టు ఫేస్: భారత్ భాగస్వామ్యం లేకుండా అసాధ్యమంటోన్న ట్రంప్: కీలక భేటీ వాయిదా

   ట్రంప్ కుటుంబంతో సహా

  ట్రంప్ కుటుంబంతో సహా

  ట్రంప్ వెంట ఆయన భార్య మెలానియా ట్రంప్, కుమారుడు బరోన్ ట్రంప్ కూడా బంకర్‌లోకి వెళ్లారా? లేదా? అనేది స్పష్టంగా తెలియరావట్లేదు. కుటుంబంతో సహా ఆయన ఎలివేటర్ ద్వారా బంకర్‌లోకి వెళ్లారని విదేశీ మీడియా వెల్లడించింది. దీన్ని వైట్‌హౌస్ ప్రతినిధులు ధృవీకరించట్లేదు. ట్రంప్ ఒక్కరే సుమారు గంట నుంచి రెండు గంటల పాటు బంకర్‌లో గడిపిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ బయటికి వచ్చారని, యధాతథంగా తన రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నం అయ్యారని సమాచారం.

  ఆఫ్రికన్ అమెరికన్ హత్యోదంతంతో

  ఆఫ్రికన్ అమెరికన్ హత్యోదంతంతో

  జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం అనంతరం అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రదర్శనలు చాలాచోట్ల హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి దారి తీసింది. పోలీసులపై సైతం నిరసనకారులు దాడులకు పాల్పడుతున్నారు. ఆఫ్రికన్ అమెరికన్ జాతీయులు అందరూ ఏకం అయ్యారు. డొనాల్డ్ ట్రంప్‌ ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను చేపట్టారు.

  వైట్‌హౌస్ వద్ద మిన్నంటిన నిరసనలు

  వైట్‌హౌస్ వద్ద మిన్నంటిన నిరసనలు

  మూడురోజులుగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. 28 రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన సెగ వైట్‌హౌస్‌కు తాకింది. పెద్ద ఎత్తున అమెరికన్ ఆఫ్రికన్ నిరసనకారులు వైట్‌హౌస్ వద్ద గుంపుగా చేరారు. ట్రంప్‌కు నిరసనగా ప్లకార్డులను ప్రదర్శించారు. వ్యతిరేక నినాదాలతో పరిసరాలను హోరెత్తించారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్‌, ఫ్లాష్ బ్యాంగ్ పరికరాలను ప్రయోగించాల్సి వచ్చింది.

  నిరసన ఫలితంగా..

  నిరసన ఫలితంగా..

  వైట్‌హౌస్ పరిసరాల్లో టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని అసాధారణ చర్యగా అభివర్ణిస్తున్నారు. దీని ఫలితంగా డొనాల్డ్ ట్రంప్ అండర్‌గ్రౌండ్ బంకర్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. అధ్యక్షుడి రక్షణ కోసం వైట్‌హౌస్‌ కింద వాటిని నిర్మించారు. మిస్సైళ్లను సంధించినా చెక్కుచెదరని విధంగా ఆ బంకర్లు నిర్మితం అయ్యాయి. ఎప్పటికప్పుడు వాటిని బలోపేతం చేయడానికి అమెరికా ప్రభుత్వం బడ్జెట్‌ను సైతం కేటాయిస్తుంటుంది.

  ఉగ్రవాద సంస్థగా ఆంటిఫా

  ఉగ్రవాద సంస్థగా ఆంటిఫా

  మరోవంక- జాత్యహంకారానికి వ్యతిరేకంగా అమెరికాలో కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఆంటిఫా సంస్థపై ఉగ్రవాద ముద్ర పడింది. ఆంటిఫాను ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. వామపక్ష భావజాలం ఉన్న సంస్థ ఇది. యాంటీ ఫేసిస్ట్‌గా, మిలిటెంట్ పొలిటికల్ యాక్టివిస్ట్‌గా ఈ సంస్థకు గుర్తింపు ఉంది. అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, రూపొందించే విధానాలపై తరచూ తనదైన శైలిలో నిరసనలను తెలియజేస్తుంటుందీ ఈ ఆంటిఫా. జార్జ్ ప్లాయిడ్ హత్యోదంతం అనంతరం చోటు చేసుకున్న పరిణామాల వెనుక ఆంటిఫా హస్తం ఉన్నట్లు ట్రంప్ అనుమానిస్తున్నారు.

  English summary
  As protesters gathered outside the White House Friday night in Washington, DC, US President Donald Trump was briefly taken to the underground bunker for a period of time, according to a White House official and a law enforcement source. The President was there for a little under an hour before being brought upstairs. It's unclear if first lady Melania Trump and Barron Trump were also taken down with him.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more