వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్ విగ్రహం ధ్వంసం .. చేసింది ఎవరు ?

|
Google Oneindia TeluguNews

యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ యొక్క చెక్క విగ్రహాన్ని గుర్తు తెలియని అగంతకులు ధ్వంసం చేశారు. మెలానియా ట్రంప్ చెక్క విగ్రహానికి జులై 4వ తేదీ రాత్రి మెలానియా ట్రంప్ స్వస్థలమైన స్లోవేనియాలో , సెవ్నికా సమీపంలో దుండగులు నిప్పు పెట్టారు. అమెరికన్లు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో మెలానియా ట్రంప్ విగ్రహానికి నిప్పు పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

యూఎస్ జోక్యాన్ని ఏమాత్రం అంగీకరించం.. అమెరికాపై చైనా వీసా ఆంక్షలు : యూఎస్, చైనా మధ్య ఘర్షణయూఎస్ జోక్యాన్ని ఏమాత్రం అంగీకరించం.. అమెరికాపై చైనా వీసా ఆంక్షలు : యూఎస్, చైనా మధ్య ఘర్షణ

మెలానియా విగ్రహ ధ్వంసంపై కొనసాగుతున్న దర్యాప్తు

మెలానియా విగ్రహ ధ్వంసంపై కొనసాగుతున్న దర్యాప్తు

వలసదారులపై ఉక్కుపాదం మోపిన అధ్యక్షుడిని వివాహం చేసుకున్న వలసదారు గా మెలానియా ట్రంప్ ఉందని అందుకే ఆమె విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా ప్రస్తుతం అమెరికాలో రాజకీయ దుమారం మొదలైంది. మెలానియా ట్రంప్ విగ్రహం ధ్వంసం పై ఇప్పటివరకు ఆమె కార్యాలయ వర్గాలు ఏమీ మాట్లాడలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు.

 విగ్రహ శిల్పి ఆసక్తికర వ్యాఖ్యలు

విగ్రహ శిల్పి ఆసక్తికర వ్యాఖ్యలు

బెర్లిన్ కు చెందిన అమెరికన్ కళాకారుడు బ్రాడ్ డౌనీ ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ ఈ సంఘటన గురించి జూలై 5 న పోలీసులు తనకు సమాచారం ఇచ్చిన వెంటనే దెబ్బతిన్న విగ్రహాన్ని తొలగించానని పేర్కొన్నారు. అసలు మెలానియా ట్రంప్ విగ్రహాన్ని ధ్వంసం ఎందుకు చేసారో తెలుసుకోవాలని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అమెరికాలో ఇమ్మిగ్రేషన్ తగ్గించడానికి, వలసదారుల పై ఉక్కుపాదం మోపడానికి ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ ను వివాహం చేసుకున్న వలసదారుగా మెలానియా ట్రంప్ యొక్క స్థితి ఉందని డౌని వ్యాఖ్యానించారు.

అధ్యక్ష ఎన్నికల రాజకీయ వేడి మొదలైన సమయంలో విగ్రహ ధ్వంసం

అధ్యక్ష ఎన్నికల రాజకీయ వేడి మొదలైన సమయంలో విగ్రహ ధ్వంసం

అమెరికాలో నల్లజాతీయుడిపై అమెరికా పోలీసుల దాష్టీకానికి వ్యతిరేకంగా రాజకీయ ఆందోళనలు దేశవ్యాప్తంగా చెలరేగినందున, ఇటీవల అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో నిలిచారు. ఇక మరో పక్క అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్న నేపథ్యంలో అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సమయంలో స్లోవేనియాలో ఉన్న మెలానియా ట్రంప్ విగ్రహం ధ్వంసం కావడం ఆసక్తికరంగా మారింది. గతంలో డోనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని కూడా దుండగులు దగ్ధం చేయడం గమనార్హం.

English summary
A wooden sculpture of US first lady Melania Trump was torched near her hometown of Sevnica, Slovenia, on the night of July Fourth, as Americans celebrated US Independence Day, said the artist who commissioned the sculpture. Brad Downey, a Berlin-based American artist, told Reuters he had the life-sized blackened, disfigured sculpture removed as soon as police informed him on July 5th of the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X