వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ స్వదేశీ వాదం: అగ్రరాజ్యంలో ఇక అడుగు పెట్టలేం: హెచ్-1బీ సహా అన్ని విసాలపైనా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఊహించిందే జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. విదేశీయులకు తలుపులను మూసివేశారు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. అగ్రరాజ్యంలో ఇప్పట్లో బయటి వ్యక్తులెవరూ అడుగు పెట్టలేరు. కనీసం డిసెంబర్ వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది. కరోనా వైరస్ కుమ్మేస్తోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: కలకలం: అసెంబ్లీ సమావేశాలకు హాజరు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటువైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్: కలకలం: అసెంబ్లీ సమావేశాలకు హాజరు.. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు

హెచ్-1బీ సహా

హెచ్-1బీ సహా

హెచ్-1బీ విసాలపై సంచల నిర్ణయాన్ని తీసుకున్నారు. హెచ్-1బీ విసాలను రద్దు చేశారు. ఇప్పటికే 60 రోజుల పాటు హెచ్-1బీ విసాలను జారీ చేయడాన్ని రద్దు చేసిన అమెరికా.. దీన్ని డిసెంబర్ వరకూ పొడిగించారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వాటి పునరుద్ధరణపై నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ రద్దు ప్రక్రియ ఒక్క హెచ్-1బీ విసాలకు మాత్రమే పరిమితం చేయలేదు. హెచ్-2బీ, ఎల్-1లకూ వర్తింపజేశారు. పరిస్థితులు మెరుగుపడితేనే జనవరి నుంచి విసాలను పునరుద్ధరించే అవకాశం ఉంది.

వారికి మినహాయింపు..

వారికి మినహాయింపు..

సీజనల్ వర్కర్లకు కేటాయించే హెచ్-2బీ విసాల జారీలో కొన్న మినహాయింపులను ప్రకటించారు. ఫుడ్ సర్వీస్ ఇండస్ట్రీలో పనిచేయదలిచిన వర్కర్లకు మాత్రం హెచ్-2బీ విసాలను జారీ చేస్తారు. తమ కార్యాలయాల పరిధిలో బదిలీల ద్వారా అమెరికాకు వచ్చే ఉద్యోగులు, వర్కర్లకు జారీ చేసే ఎల్-1 వీసాలను కూడా డిసెంబర్ వరకు రద్దు చేశారు. బుధవారం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ ప్రతినిధి వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రకటనను జారీ చేశారు.

ఆరు నెలల పాటు రద్దు ప్రతిపాదనలపై

ఆరు నెలల పాటు రద్దు ప్రతిపాదనలపై

ఇంటర్న్‌షిప్, ట్రైనీ, టీచర్లు, క్యాంప్ కౌన్సిలర్ల కోసం జారీ చేసే కేటగిరీ జే విసాలను రద్దు చేయనప్పటికీ.. వాటిని పరిమితంగా మాత్రమే జారీ చేస్తారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కొద్దిసేపటి కిందటే డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారని వైట్‌హౌస్ ప్రతినిధి ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు రద్దు కొనసాగుతుందని అన్నారు. 2021 జనవరి 1వ తేదీ నుంచి కొత్త విసాలను మంజూరు చేయొచ్చని తెలిపారు.

 స్వదేశీ వాదం..

స్వదేశీ వాదం..

కరోనా వైరస్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు బీటలు వారాయి. ఆర్థిక పరిస్థితులు తలకిందులు అయ్యాయి. కోట్లాదిమంది అమెరికన్లు ఉద్యోగాలను కోల్పోయారు. రోడ్డున పడ్డారు. వారికి ఉపాధిని కల్పించడం, దేశీయ కంపెనీలకు ఆర్థికంగా చేయూతను అందించాలనే ఉద్దేశంతోనే డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆరు నెలల పాటు విదేశీ కంపెనీలను గానీ, విదేశాల నుంచి వచ్చే సాఫ్ట్‌వేర్ ఇతర రంగాలకు చెందిన నిపుణులను గానీ ప్రోత్సహించకూడదని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు.

Recommended Video

H1B Visa... మరిన్ని ఆంక్షలు, భారతీయులకి ట్రంప్ షాక్!! | Oneindia Telugu
 ప్రతిభ ఆధారంగా..

ప్రతిభ ఆధారంగా..

ఇకపై అమెరికా జారీ చేయబోయే హెచ్-1బీ విసాల నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ప్రతిభ గల వారికి మాత్రమే ఈ విసాలను జారీ చేయొచ్చని పారిశ్రామికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రొఫెషనల్స్, స్కిల్డ్ వర్కర్లకు కేటాయించే హెచ్-1బీ వీసాల్లో అమెరికా ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేర్పులను తీసుకుని వచ్చినప్పటికీ.. దాని ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుంది. కొత్త నిబంధనల ఆధారంగానే వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి జారీ చేసే కొత్త హెచ్-1బీ విసాలను జారీ చేస్తారని చెబుతున్నారు.

English summary
US President Donald Trump will expand an existing visa ban to include certain non-immigrant work visas as part of a move to protect US workers amid the economic devastation tied to the coronavirus pandemic, a senior administration official said on Monday. Trump will block the entry of foreign workers on H-1B visas for skilled workers and L-1 visas for workers being transferred within a company through the end of the year, the official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X