వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sexual Assault..?:తారారీడ్ ఆరోపణలను ఖండించిన అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్

|
Google Oneindia TeluguNews

అమెరికా డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్‌ను లైంగిక వేధింపుల అంశం ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన తారా రీడ్‌పై బిడెన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. ఇది నిజం కాదు అని.. తాను ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని 'ఎంఎస్‌ఎన్‌బీసీ' వార్తాసంస్థకు బిడెన్ స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ఆయనకు లైంగిక వేధింపుల అంశం ప్రతికూలంగా మారడంతో.. స్పందించారు.

Recommended Video

Trump Impeachment Trial : If Trump Impeached, How Does It Impact India ?

తారా రీడ్ 1992 డిసంబర్ నుంచి 1993 ఆగస్ట్ వరకు అమెరికా సెనెట్ కార్యాలయంలో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో బిడెన్ తనను గోడకు వేసి, స్కర్ట్ తీసేసి.. చేతివేళ్లను లోపలికి తీసుకెళ్లాడు అని తారా ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలను ట్రంప్‌పై ఎదుర్కొనబోతున్న బిడెన్.. ఇంటా, బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు.

US Presidential Candidate Joe Biden Denies Allegations of Sexual Assault

తన జీవితంలో మహిళల ఉన్నతి కోసం పనిచేశానని గుర్తుచేశారు. వారికి సులువుగా ఉద్యోగాలు వచ్చేలా, పురుషులతో సమానంగా వేతనాలు చెల్లించేలా, సమాన అవకాశాలు కల్పించేలా పనిచేశానని గుర్తుచేశారు. ఇంట్లోనే కాదు పనిచేసే చోట కూడా వారిని వేధించొద్దని పోరాడానని బిడెన్ తెలిపారు. మహిళలు హక్కుల కోసం ఎంత పోరాడామో తనకు తెలుసునని.. తన జీవితంలో కొన్ని ఘట్టాలను వారి ఉన్నతి కోసం కేటాయించానని.. అది కొనసాగుతోందని పేర్కొన్నారు.

ఇప్పటికీ కూడా తాను మహిళల నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటానని, వారు చెప్పే అంశాలను సావధానంగా వింటానని, వారికి సంపూర్ణంగా మద్దతును ఇస్తానని బిడెన్ చెప్పారు. అంతేకాదు తాను ప్రవర్తించిన అంశానికి సంబంధించి ఆ సమయంలో ఎలాంటి ఫిర్యాదు వచ్చిందా అని అమెరికా సెనేట్‌ను బిడెన్ అడిగారు.

English summary
"No, It is not true. I'm saying unequivocally it never, ever happened," US Presidential Candidate Joe Biden said in an interview on MSNBC when asked if he assaulted his aide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X