వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షమించండి.. హౌడీ మోడీకి హజరుకాలేకపోతున్నాను : తులసీ గబ్బర్డ్

|
Google Oneindia TeluguNews

మరో రెండు రోజుల్లో అమేరికాలో అతిపెద్ద సభ జరగబోతుంది. అమేరికాలో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ప్రవాస భారతీయులు సుమారు 50వేల మందితో హౌది,మోడీ సభను ఏర్పాటు చేశారు. ఈనెల 22 జరగనున్న సభలో ఒకే వేదికపై అగ్రరాజ్య అధిపతి అయిన ట్రంప్‌తో పాటు భారత ప్రధాని మోడీ ఓకే వేదికను పంచుకోనున్నారు.ముఖ్యంగా 2020లో అమేరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంధర్భంలో హౌదీ మోదీకి సభకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నేపథ్యంలోనే రానున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు మొగ్గు చూపుతున్న భారత సంతతికి చెందిన తులసి గబ్బర్డ్ సభకు హజరుకాలేకపోతున్నందుకు క్షమాపణాలు తెలిపింది. దీంతో పాటు సభకు విచ్చేస్తున్న మోడీకి స్వాగతం పలుకుతూ ఓ వీడీయోను కూడ విడుదల చేసింది. భారత్, అమేరికాలు అనేక అంశాలలో కలిసి పనిచేయాలని ఆమే కొరారు. ముఖ్యంగా అణు వ్యవస్థతో పాటు ఆర్ధిక వ్యవస్థలో కూడ రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఆమే కోరారు. మరోవైపు అమేరికా వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఏకతాటిపై రావడం అభినందనీయం తెలిపిన ఆమే రెండు దేశాల మధ్య ఉన్న అనుబంధం ఇలాగే కొనసాగాలని ఆమే ఆకాంక్షించారు.

US Presidential candidate Tulsi Gabbard says sorry for not attend Howdy, Modi

కాగా 2020లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన తులసి పోటిచేసే యోచనలో ఉన్నారు. గతంలో నాలుగు సార్లు డెమోక్రటిక్ పార్టీ తరఫున హౌజ్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్‌కు ఎంపియ్యారు. తులిసి గనుక పోటి చేస్తే మొదటిసారిగా అమేరికాలో పోటి చేస్తున్న భారతీయ హిందూ మహిళ కానున్నారు.

English summary
US Presidential candidate Tulsi Gabbard has released a video welcoming Prime Minister Modi to the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X