వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు అమెరికా బంపర్‌ ఆఫర్‌- ఘర్షణ వద్దు-నిజాయితీగా పోటీపడదాం- బైడెన్ సూచన

|
Google Oneindia TeluguNews

అమెరికాలో తాజాగా జరిగిన ఎన్నికల తర్వాత ప్రపంచ దేశాలతో అగ్రరాజ్యం వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ట్రంప్‌ హయాంలో రక్షణాత్మక వైఖరితో అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొన్న అమెరికాను తిరిగి ఆయా దేశాలకు చేరువ చేసేందుకు కొత్త అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కీలకమైన చైనా విషయంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు భవిష్యత్‌ పరిణామాలకు సంకేతంగా నిలుస్తున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి బదులు పోటీ మాత్రమే ఉంటుందని బైడెన్‌ తాజాగా వ్యాఖ్యానించారు.

 అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం

అమెరికా-చైనా ట్రేడ్‌ వార్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, చైనా తమ ఆధిపత్య పోరులో భాగంగా ప్రపంచ దేశాలకు అవసరమైన సామాగ్రిని తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాయి. తద్వారా వాటిని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని ఆశించాయి. ఇది ఓ దశలో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధంగా పరిణమించింది. ఒకరి ఉత్పత్తులు మరొకరు బహిష్కరించుకునే వరకూ ఇది సాగింది. అయితే తాజాగా మారిన పరిస్ధితుల్లో ఆగ్ర రాజ్యాల మధ్య తీవ్ర పోటీ తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీస్తున్నాయి.

 ఘర్షణకు చెక్‌- తీవ్ర పోటీ ఉంటుందన్న బైడెన్‌

ఘర్షణకు చెక్‌- తీవ్ర పోటీ ఉంటుందన్న బైడెన్‌

చైనాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగిస్తున్న వాణిజ్య యుద్ధం, ఘర్షణ స్ధానంలో ఇకపై తీవ్ర పోటీ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. తద్వారా ట్రంప్ హయాంలో సాగించిన యుద్ధానికి ముగింపు పలుకుతున్నట్లు బైడెన్‌ చెప్పకనే చెప్పారు. ప్రపంచ అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా-చైనా మధ్య తీవ్ర పోటీ ఉుంటుందని బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఘర్షణ స్ధానంలో పోటీ ఉంటుందని చెప్పడం వెనుక కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

 జిన్‌పింగ్‌ కఠినాత్ముడు, అప్రజాస్వామికుడు

జిన్‌పింగ్‌ కఠినాత్ముడు, అప్రజాస్వామికుడు

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో చైనా అధినేత జిన్‌పింగ్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

తాను అధికారంలోకి వచ్చాక చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇప్పటివరకూ మాట్లాడలేదని, అయితే ఆయన చాలా కఠినంగా ఉంటారని బైడెన్‌ తెలిపారు. ఇది విమర్శ కాదని, వాస్తవం మాత్రమేనని బైడెన్ పేర్కొన్నారు. జిన్ పింగ్‌ ప్రజాస్వామిక వాది కాదని, ఆయన శరీరంలో ఎక్కడో ఓ చిన్న ప్రజాస్వామిక ఎముక మాత్రమే ఉందన్నారు.

 జిన్‌పింగ్‌కు బైడెన్ సలహా ఇదే

జిన్‌పింగ్‌కు బైడెన్ సలహా ఇదే

చైనా అధినేత జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఓ సలహా కూడా ఇచ్చారు. జిన్‌పింగ్‌ను నేను చెప్పాలనుకుంటోఁది ఒక్కటే. మన ఇరుదేశాల మధ్య ఘర్షణ అవసరం అయితే అది తీవ్ర పోటీగా మాత్రమే అని బైడెన్‌ తెలిపారు. నేను ట్రంప్‌లా చేయాలనుకోవడం లేదని, అంతర్జాతీయ నిబంధనలను ఇరువురూ గౌరవించుకుందామని జిన్‌పింగ్‌కు బైడెన్ సూచించారు. తద్వారా బైడెన్... జిన్‌పింగ్‌కు తాను ట్రంప్‌లా వ్యవహరించనని, మనం కేవలం అంతర్జాతీయ పద్ధథుల ప్రకారం వాణిజ్యంలో పోటీపడతామని ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు.

దీనిపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

English summary
American President Joe biden anticipates the US rivalry with China will take the form of Extreme competition rather than conflict between two world powers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X