వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ ఎఫెక్ట్: సముద్రాల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన

భూతాపం నివారణకు అనుసరించాల్సిన విధి విధానాలు రూపొందించేందుకు ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయం వేదికగా ఉన్న న్యూయార్క్‌లో ప్రపంచ దేశాధినేతలు సమావేశమయ్యారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

మియామీ: భూతాపం నివారణకు అనుసరించాల్సిన విధి విధానాలు రూపొందించేందుకు ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయం వేదికగా ఉన్న న్యూయార్క్‌లో ప్రపంచ దేశాధినేతలు సమావేశమయ్యారు. సోమవారం నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రపంచంలోని మహా సముద్రాలను పరిరక్షించేందుకు అనుసరించాల్సిన వ్యూహ, ప్రతి వ్యూహాలను ఈ సదస్సులో రూపొందించనున్నారు.

పెరిగిపోతున్న సముద్ర మట్టాలను తగ్గించడానికి, కోరల్ బ్లీచింగ్ నుంచి ప్లాస్టిక్ కాలుష్యం భారీ నుంచి సముద్ర జలాల పరిరక్షణే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. తద్వారా భూగోళాన్ని, మానవాళిని సంరక్షించుకునేందుకు అర్థవంతమైన మార్పులకు కార్యాచరణ రూపొందించడమే దీని ధ్యేయం. ప్రజలందరికి ముఖ్యమైన వినియోగ వనరుగా భూగోళాన్ని నిలబెట్టేందుకు అనుసరించే వ్యూహం, ఎత్తుగడలు ఈ సదస్సులో చర్చిస్తారని నిపుణులు అంటున్నారు.

ఏడాదిన్నర క్రితం 2015 డిసెంబర్‌లో 195 సభ్య దేశాలు సంతకాలు చేసిన 'పారిస్ ఒప్పందం' అమలు చేయబోమని గత గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన వెలుగులో మహా సముద్రాల పరిరక్షణ సదస్సు జరుగనుండటం విశేషం.

US Pullout Hot Topic as UN Talks to Save Oceans Kick Off Today

ఓషియన్ల సదస్సులో ట్రంప్ వైఖరి చర్చనీయాంశం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలపై సదస్సులో పాల్గొనే ప్రతినిధులు చర్చించే అవకాశం ఉన్న ఈ సదస్సుకు అమెరికా నుంచి కీలకమైన ప్రతినిదులు హాజరయ్యే అవకాశాలు లేవని అధికార వర్గాలు చెప్తున్నాయి. ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచ దేశాధినేతలంతా ఖండించినా ప్యూ చారిటబుల్ ట్రస్ట్ నిపుణులు మాత్రం పారిస్ సదస్సు తీర్మానం అమలుకు అమెరికా ముందుకు వస్తుందని, ఒప్పందంపై సంతకాలు చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. సదస్సులో చర్చించేందుకు రూపొందించిన మూడు పేజీల ముసాయిదా కూడా వాతావరణ మార్పుతో సముద్రాలపై ఆందోళనకర స్థాయిలో ప్రభావితం చేస్తున్నదని పేర్కొన్నది.

వరుసగా మూడేళ్లుగా అత్యంత వేడి

ఆధునిక ప్రపంచం ప్రస్తుత పరిస్థితుల్లో వరుసగా అత్యంత వేడిగల సంవత్సరాలను చూసింది. ప్రజలంతా తమ జీవితంలో వాతావరణంలోకి విడుదలచేసిన కర్బన ఉద్గరాలు అందునా కార్బన్ డయాక్సైడ్‌లో మూడో వంతు తనలో ఇంకింపజేసుకున్నది. పూర్తిస్థాయిలో వాతావరణం మార్పుతో పూర్తిస్థాయిలో భూగోళం భగభగ మండిపోకుండా చూసుకోవడమే లక్ష్యంగా ప్రపంచ మానవాళి ముందుకు సాగుతున్నది. పర్వత శ్రేణుల్లోని గ్రేసియర్లు కరిగిపోతుండటంతో సముద్ర జలాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. పూర్తిస్థాయిలో గ్రేసియర్లు, పర్వత శ్రేణుల్లో మంచు కరిగిపోతే సమీప దశాబ్దాల కాలంలో ద్వీపాల్లోనూ, కోస్తా తీర ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న 37 శాతం ప్రజలు నిర్వాసితులై పోతారు.

అర మీటర్ సముద్ర జలాలు పెరిగితే 12 లక్షల మంది నిర్వాసితులే

సముద్ర జలాలు అర మీటర్ (20 అడుగులు) పెరిగితే కరేబియా సముద్రం, హిందూ, పసిఫిక్ మహా సముద్రాల పరిధిలోని కోస్తాతీరంలో 12 లక్షల మంది ఇండ్లు లేనివారై పోతారని ఒక అధ్యయనం తేల్చింది. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల్లో ప్లాస్టిక్ కాలుష్యం సముద్రాలకు సమస్యలు తెచ్చి పెడుతున్నాయని ఒక అధ్యయన సారాంశం. దక్షిణ పసిఫిక్, హిండర్సన్ ద్వాపాల్లో వేల మైళ్ల పొడవునా విస్తరించిన నాగరిక సమాజంలో రోజూ 3500 కంటే ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులు సముద్ర జలాల్లో చేరిపోతున్నాయి.

ప్లాస్టిక్ వ్యర్థాలతో 800 కోట్ల డాలర్ల నష్టం

ప్రతిఏటా సముద్రాల్లో పడుతున్న 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల సముద్ర పర్యావరణానికి 800 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. 10 లక్షల సముద్ర పక్షులు మరణిస్తాయి. లక్ష సముద్ర చరాలు, మత్స్య సంపద దెబ్బ తింటున్నది. గత 50 - 60 ఏళ్లుగా సముద్రాల పరిస్థితి తీవ్రంగా దెబ్బ తింటున్నది.

10 శాతం పరిశుభ్రత పాటించినా పర్యావరణ తేలిక

2020 నాటికి కోస్తా, సముద్ర జలాల్లో 10 శాతం పరిస్థితి మెరుగు పడినా సముద్రాల పర్యావరణ మరింత మెరుగుదలకు వీలవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రతియేటా పసిఫిక్ మహా సముద్రంలో చట్ట విరుద్ధంగా 74 కోట్ల డాలర్ల విలువైన చేపలు చట్ట విరుద్దంగా పట్టుకుంటున్నారని తేలింది.

English summary
Miami: World leaders convene at UN headquarters next week for the first major bid to solve the toughest problems facing our oceans, from coral bleaching to plastic pollution, overfishing and rising seas due to climate change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X