వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమాఖ్య నుంచి వైదొలిగిన అమెరికా

|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సమాఖ్య నుంచి అమెరికా వైదులుగుతున్నట్లు ఐక్యరాజ్యసమితికి అమెరికా దౌత్యవేత్తగా ఉన్న నిక్కీ హేలీ ప్రకటించారు. మానవహక్కుల సమాఖ్య పేరుకు తగినట్లుగా వ్యవహరించడంలేదని ఆమె ఆరోపించారు. ఇజ్రాయిల్‌ దేశం పట్ల ఐక్యరాజ్య సమితి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ కఠిన నిర్ణయం తీసుకుందన్నారు. అంతేకాదు మానవహక్కులను ఉల్లంఘిస్తున్న చైనా, క్యూబా, వెనెజులా, కాంగోలాంటి దేశాలు సమాఖ్యలో సభ్యులుగా ఉండటాన్ని కూడా ఆమె తప్పుబట్టారు.

ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సమాఖ్యనుంచి వైదొలగడం కఠిన నిర్ణయమే అయినప్పటికీ తమకున్న విలువల ఆధారంగా బయటికి రాక తప్పడం లేదని నిక్కీ అన్నారు. మానవహక్కులను ఎగతాళి చేయలేమని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సమాఖ్యకు గొప్ప విజన్ ఉండేదని ఇప్పుడది కొరవడిందని అన్నారు అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పొంపో. ప్రస్తుతం ఉన్న సమాఖ్య మానవహక్కులను పరిరక్షించడంలో విఫలమైందని మైక్ అభిప్రాయపడ్డారు.

US pulls out of UN Human Rights Council, cites bias against Israel

ఓవైపు సమాఖ్య నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటిస్తూనే తమ నిర్ణయం శాశ్వతమైనది కాదని నిక్కీ చెప్పుకొచ్చారు. మానవహక్కుల సమాఖ్య సంస్కరణలు తీసుకొస్తే అమెరికా తిరిగి సమాఖ్యలో కొనసాగుతుందని చెప్పారు. సమాఖ్య నుంచి వైదొలగినప్పటికీ... ఐక్యరాజ్యసమితి మానవహక్కులను పరిరక్షించేందుకు అమెరికా కృషి చేస్తుందని నిక్కీ స్పష్టం చేశారు.

English summary
The United States has announced that it is leaving the United Nations Human Rights Council. Making the announcement, Ambassador, Nikki Haley called it an organisation that is not worthy of its name.Nikki clarified that this was not a permanent decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X