• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్: పిల్లి కళేబరాన్ని తొవ్వి తీసి -కూరలా వండుకుని తిన్న సెలబ్రిటీ -పెను దుమారం

|

క్రేజీనెస్‌కే పిచ్చేక్కించే షాకింగ్ సంఘటన ఇది. మనుషుల్లో.. అందునా మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల్లోనూ ఇలాంటి ఉన్మాదులుంటారా? అనిపించేలా ప్రపంచాన్ని షేక్ చేస్తోంది సంచలన వీడియో. మూగ జీవాల పట్ల, వాటి పట్ల కొందరు రాక్షసంగా ప్రవర్తించే తీరుపై ఇటీవల స్పందన బాగా పెరిగిన నేపథ్యంలో ఈ కథనంలోని యువతిని సైతం జనం దుమ్మెత్తి పోస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

బైక్ వెనుక కూర్చొని కసితీరా ఖతం చేసింది -మోసం చేసిన ప్రియుడిపై యువతి ఆక్రోషం -పశ్చిమగోదావరిలోబైక్ వెనుక కూర్చొని కసితీరా ఖతం చేసింది -మోసం చేసిన ప్రియుడిపై యువతి ఆక్రోషం -పశ్చిమగోదావరిలో

ర్యాపర్ అజీలియా వికృతం..

ర్యాపర్ అజీలియా వికృతం..

మనం ప్రాణంగా చూసుకునే పెంపుడు జంతువులు చనిపోతే.. సొంతవాళ్లే పోయినంత రేంజ్ లో బాధపడుతుంటాం. కొందరైతే తమ పెంపుడు జీవులకు ఘనంగా అంత్యక్రియలు చేసి, దశదిన కర్మలు సైతం నిర్వహించి తమ ప్రేమను చాటుకుంటారు. కానీ అమెరికాకు చెందిన ప్రముఖ ర్యాప్ సింగ్ అజీలియా బ్యాంక్స్(29) మాత్రం చనిపోయిన తన పిల్లిని వండుకుని తినేసింది. అది కూడా.. భూమిలో పాతిపెట్టిన కళేబరాన్ని బయటికి తీసిమరీ జుగుప్సాకరమైన పనికి ఒడిగట్టింది..

దాని వయసు 11ఏళ్లు..

దాని వయసు 11ఏళ్లు..

ఎక్కువగా సోషల్ మీడియాలో, అడపాదడపా మ్యూజిక్ బ్యాండ్లలో ర్యాప్ పాడే అజీలియా బ్యాంక్స్ కు పెంపుడు జంతువులంటే ఎంతో ఇష్టమట. ఈ విషయాన్ని ఆమె గతం నుంచే పోస్టుల రూపంలో చెబుతూ వచ్చింది. 2009లో పుట్టిన ఓ పిల్లిని పెంచుకూంటూ.. దానికి ‘లుసీఫర్' అని ముద్దుపేరుతో పిలుస్తూ రకరకాల భంగిమల్లో ఫోటోలను షేర్ చేసేది. 2020లో ఆ పిల్లి చనిపోయిన సందర్భంలో అజీలియా వలావలా ఏడుస్తూ.. పిల్లికి అంత్యక్రియలు నిర్వహించే వీడియోను లైవ్ లో ఇచ్చింది. మేం కూడా ఆ పిల్లిని మిస్ అవుతున్నామంటూ అభిమానులు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక్కడిదాకా అంతా బాగున్నా..

పిల్లి కూర.. లైవ్ వీడియో..

పిల్లి కూర.. లైవ్ వీడియో..

2020 చివర్లో చనిపోయిన పిల్లిని అజీలియా తన ఇంట్లోనే పెరట్లోనే పాతి పెట్టింది. కాగా, తాజాగా, పాతిపెట్టిన పిల్లి కళేబరాన్ని బైటకు తీసి వండుకుని తినడం ద్వారా ఆమె వికృతచర్యకు ఒడిగట్టింది. తెల్లటి గుడ్డలో చుట్టి, ఒక కుండలో పిల్లిని పాతి పెట్టిన చోటు నుంచి ఆ కళేబరాన్ని బయటికి తీయడం మొదలు.. దాన్ని శుభ్రంగా కడిగేసి, మాసం, పుర్రె ఎమకల్ని వండుకుని తినేశానంటూ తన వింత చేష్టలను ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వీడియో ద్వారా పంచుకుందామె. ద్వారా చెప్పుకొచ్చింది.

 మంత్రాలపై నమ్మకంతోనే?

మంత్రాలపై నమ్మకంతోనే?

పిల్లి కళేబరాన్ని వండుకుని తింటున్నానంటూ అజీలియా పెట్టిన వీడియోలు, ఫొటోలపై ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. దీంతో సదరు పోస్టులను ఇన్‌స్టాగ్రామ్ నుంచి డిలిట్ చేసింది. ర్యాపర్ అజీలియాపై గతంలోనూ అనూహ్య ఆరోపణలు వచ్చాయి. భూతశాస్త్రంపై నమ్మకంతో ఆమె 2016లో మంత్రగత్తెలా ఇంట్లోనే కోళ్లను బలిచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా పిల్లి కళేబరాన్ని తినడం ద్వారా ఆమె మానసిక స్థితి మరోసారి బయటపడింది.

అలెర్ట్: sankranti: ఊరెళ్లిపోయారా? -ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు: పోలీసుల హెచ్చరికఅలెర్ట్: sankranti: ఊరెళ్లిపోయారా? -ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు: పోలీసుల హెచ్చరిక

English summary
Azealia Banks took to Instagram on Tuesday showing viewers an altar she had put together after previously posting a gruesome clip that appeared to show her digging up her dead pet cat Lucifer and boiling it. In the Instagram Stories clip, the 29-year-old artist posted a collection of items that included what was presumably the cat's skull; a bottle of Veuve Clicquot champagne, a bottle of Chanel No. 5 perfume, a $100 bill and a crucifix in a pink pot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X