వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెన్ను విరిచిన కరోనా: అమెరికాలో ఒక్క రోజే సుమారు 1973 మంది మృతి: రెండు రోజుల్లో 3800 మందికి పైగా

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ అత్యంత భయానకంగా దెబ్బకొట్టింది. ఇప్పట్లో కోలుకోలేని విధంగా వెన్ను విరిచింది. ఇదివరకు ఎప్పుడూ లేనివిధంగా కరోనా వైరస్ మరణాల్లో ఎవరూ కోరుకోని రికార్డులను సాధిస్తోంది అమెరికా. కరోనా కరాళనృత్యాన్ని ప్రతిఘటించలేక చేతులు ఎత్తేసిన ఆ దేశ ప్రభుత్వం.. ఉన్నంతలో అందుబాటులో ఉన్న వైద్య వనరులన్నింటినీ వినియోగిస్తున్నప్పటికీ..కరోనా మరణాలకు అడ్డుకట్ట వేయలేకపోతోంది. రెండు లక్షల మంది వరకు మరణించే అవకాశం ఉందంటూ ఇదివరకు వైట్ హౌస్ ప్రతినిధులు వేసిన అంచనాలు వాస్తవ రూపం దాల్చేలా కనిపిస్తోందక్కడి తాజా పరిస్థితి.

ఊపిరాడని అమెరికా: ఒక్కరోజే 1858 మంది మృతి: న్యూయార్క్ ఛిన్నాభిన్నం: శ్మశానాలుగా నగరాలు..ఊపిరాడని అమెరికా: ఒక్కరోజే 1858 మంది మృతి: న్యూయార్క్ ఛిన్నాభిన్నం: శ్మశానాలుగా నగరాలు..

కరోనా కాటుకు 1973 మంది మృతి..

కరోనా కాటుకు 1973 మంది మృతి..

బుధవారం ఒక్కరోజే అమెరికాలో 1973 మంది మరణించారు. అంతకుముందు రోజు 1858 మంది మరణించగా.. మరుసటి రోజే ఆ సంఖ్యను సవరించుకుంది. ఈ సారి కూడా అత్యధిక మరణాలు న్యూయార్క్‌లోనే నమోదయ్యాయి. అమెరికా ఆర్థిక రాజధానిలో 779 మంది కరోనా వైరస్ వల్ల మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6,268. 1,51,171 పాజిటివ్ కేసులు ఈ ఒక్క నగరంలోనే నమోదు అయ్యాయి. కరోనా వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో కూడా న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో పౌర జీవనం యధాతథంగా కొనసాగడం వల్లే కరోనా తీవ్రత అధికంగా ఉంటున్నట్లు చెబుతున్నారు.

అన్ని నగరాల్లో పెను ప్రభావం..

అన్ని నగరాల్లో పెను ప్రభావం..

న్యూయార్క్‌తో పోల్చుకుంటే దాని జంట నగరం న్యూజెర్సీలో కొద్దిగా ఫర్వాలేదనిపిస్తోంది. మరణాల్లో గానీ, పాజిటివ్ కేసుల సంఖ్యలో గానీ న్యూయార్క్‌తో పోటీ పడట్లేదు. న్యూజెర్సీలో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 47,437 కాగా.. 3,021 మంది మరణించారు. మిచిగాన్, కాలిఫోర్నియా, లూసియానా, మస్సాచుసెట్స్, పెన్సిల్వేనియా, ఫ్లోరిడాల్లో రోజురోజుకూ పరిస్థితి మరింత దుర్లభం అవుతూ వస్తోందే తప్ప ఎక్కడా పాజిటివ్ కేసులు గానీ, మరణాల సంఖ్య గానీ తగ్గుముఖం పట్టట్లేదు. ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా కూడా కనిపించట్లేదు.

34 వేలకు కొత్త కేసులు..

34 వేలకు కొత్త కేసులు..

అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలను దాటింది. ఏ దేశంలోనూ ఇంత భారీ ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.. చైనా సహా. పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటుకున్న పది రోజుల్లోనే నాలుగు అధిగమించడం అక్కడి తీవ్రతను స్పష్టం చేస్తోంది. అమెరికాలో నమోదైన పాజిటివ్ కేసులు 4,34,062కు చేరింది. బుధవారం ఒక్కరోజే 34 వేలకు పైగా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ బారి నుంచి బయటపడిన వారి సంఖ్య ఆ స్థాయిలో కనిపించట్లేదు. ఫలితంగా వైట్ హౌస్ ప్రతినిధులు అంచనాలు నిజం దాల్చేలా మరణాల చోటు చేసుకోవచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

Recommended Video

కరోనా వైరస్ : America Reported 1,858 In Single Day, A Record High

English summary
With models predicting the US is about to hit its coronavirus death rate peak, the country has reported nearly 2,000 deaths on Wednesday, about the same number as the previous day. The US accounts for about a third of all cases. After smashing its previous single-day death record on Tuesday by nearly crossing the 2,000 milestone, on Wednesday, John Hopkins University tally suggests.మAt least 1,973 people succumbed to the disease in the last 24 hours in the US, which is 34 people more than on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X