వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలకూ 'వయాగ్రా': అనుమతిచ్చిన యుఎస్ ఎఫ్‌డీఏ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళల్లో లైంగిక వాంఛలను పెంపొందించే డ్రగ్ అందుబాటులోకి వచ్చింది. స్ప్రౌట్ ఫార్మాస్యుటికల్స్ తయారు చేసిన 'యాడ్ ఈ'(addyi) ఔషధాన్ని మార్కెట్లో విక్రయించేందుకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది.

స్త్రీల లైంగిక అవసరాలను పట్టించుకోవడం లేదని, స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను చూపుతున్నారని ఇప్పటి వరకూ ఎఫ్‌డీఏ‌పై విమర్శలు వస్తుండేవి. గతంలో రెండు సార్లు ఈ మాత్రలకు ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. తాజా నిర్ణయంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

"అమెరికా చరిత్రలో ఇది ఓ పెనుమార్పు, మహిళల లైంగిక ఆరోగ్యం ఈ మాత్రలతో మెరుగుపడుతుంది" అని నేషనల్ కన్జూమర్స్ లీగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాలీ గ్రీన్ బర్గ్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ మాత్రలతో రక్తపీడనం తగ్గుతుందని, మెదడుపై ప్రభావం, నిస్సత్తువ కలుగుతాయనే విమర్శలు వచ్చాయి.

US Regulators Approve 'Female Viagra' Pill

దీంతో ఈ మాత్రలపై డాక్టర్లు సరైన ప్రచారం కల్పించి, పేషంట్లకు రాయాల్సిందిగా సూచించారు. మొత్తం 24 మంది సభ్యులున్న ఎఫ్డీఏలో ఈ ఔషధం మార్కెట్లోకి విడుదల చేయాలా? వద్దా? అని ఓటింగ్ పెడితే, 18 మంది అనుకూలంగా, ఆరుగురు వ్యతిరేకంగా ఓటేశారు.

'పింక్ వయాగ్రా' అని కూడా పిలుచుకునే ఈ 'యాడ్ ఈ' అక్టోబర్ 2017 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ మాత్ర డ్రగ్ కాదని, సెక్స్‌కు ఉపక్రమించే గంట ముందు వేసుకుంటే సరిపోతుందని సెక్స్ థెరపిస్ట్ లియోనోరే థైపర్ తెలిపారు.

English summary
The approval came with a warning about potentially dangerous side effects. The drug, to be sold under the trade name Addyi, has been nicknamed "female Viagra" in media reports, even though it does not work like the blockbuster pill for men.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X