వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో భారీగా అణ్వాయుధాలు: అమెరికా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అతి పెద్ద అణుశక్తి కార్యక్రమాన్ని చేపడుతూ అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్ కూడ ఒకటి అని అమెరికాకు చెందిన మెధో సంస్థ పేర్కోంది. 2014 చివరి నాటికి 75 నుంచి 125 అణ్వాయుధాలు తయారుచేసుకోగల ఫ్లూటోనియం నిల్వలు భారత్ వద్ద ఉన్నాయని తెలిపింది.

భారత్ లో ఉన్న ఆయుధ స్థాయి ప్లూటోనియం బట్టి ఆదేశంలో ఉన్న అణ్వాయుధ సంపత్తిని అంచనా వేయవచ్చని పేర్కోంది. దీని ఆధారంగా భారత్ దగ్గర 110 నుంచి 175 అణ్వాయుధాలు ఉండే అవకాశం ఉందని తెలిపింది.

అయితే దాదాపు 138 అణ్వాయుధాలు భారత్ దగ్గర ఉండవచ్చనే అంచనా కూడా వేయవచ్చని ఇన్ స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పేర్కోంది. అయితే వెపన్ గ్రేడ్ ప్లూటోనియం నిల్వలు నుంచి భారత్ తయారు చేస్తున్న ఆయుధాలు తక్కువగా ఉన్నాయని అంచనా వేసింది.

US report: India's nuclear programme among largest in developing nations

వెపన్ గ్రేడ్ యూరేనియం నిల్వల నుంచి దాదాపు 70 శాతం మాత్రమే అణ్వాయుధాల తయారి కోసం ఉపయోగించి ఉంటుందని తాము భావిస్తున్నామని ఆ సంస్థ తన నివేదికలో అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ నివేదిక రూపొందించిన రచయితల్లో భారత్ వ్యతిరేకి డేవిడ్ అల్ ట్రైట్ కూడా ఉన్నారు.

గతంలో అణు కార్యక్రమం విషయంలో డేవిడ్ అల్ ట్రైట్ భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. భారత్-అమెరికా అణు ఒప్పందం కుదరకుండా ప్రయత్నాలు చేసిన అమెరికా సంస్థల్లో ఈ మేధో సంస్థ కూడా ఉంది. అయితే ఈ నివేదికపై భారత్ ఇప్పటి వరకూ ఏ విధంగానూ స్పందించలేదు.

English summary
Stating that India has "one of the largest nuclear power programmes" among developing nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X