వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

5ఏళ్ల నుంచి ఏడాదికి, మూడు నెలలకు తగ్గింపు: పాకిస్తాన్‌కు అమెరికా వీసా షాక్, కారణమిదే!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: పాకిస్తాన్‌కు అమెరికా భారీ షాకిచ్చింది. పాకిస్తాన్పౌరులకు సంబంధించి వివిధ కేటగిరీ వీసాల కాల పరిమితిని తగ్గించింది. ఈ మేరకు పాకిస్తాన్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి మంగళవారం కొత్త విధానాలను వెల్లడించారు. ఇటీవల అమెరికా పౌరుల వీసాల విషయంలో పాక్ మార్పులు చేపట్టింది. ప్రతిగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

పాకిస్తాన్‌పై అమెరికా నిప్పులు.. పద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరికపాకిస్తాన్‌పై అమెరికా నిప్పులు.. పద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరిక

వర్క్‌, మిషనరీస్‌కు సంబంధించిన వీసాల గడువును అమెరికా అయిదేళ్ల నుంచి ఏడాది కాలానికి కుదించింది. జర్నలిస్టుల వీసాల గడువును ఐదేళ్ల నుంచి మూడు నెలలకు తగ్గించింది. పాకిస్తాన్ పౌరులకు వీసా దరఖాస్తు ఫీజును కూడా పెంచింది. గతంలో ఇది 160 డాలర్లు ఉండగా, ఇప్పుడు 192 డాలర్లకు పెంచింది. వర్తక, టూరిజం, స్టూడెంట్‌ వీసాల కాలపరిమితి మాత్రం అయిదేళ్ల పాటు చెల్లుబాటు అవుతుందని తెలిపింది.

US revises visa policy for Pakistanis

అమెరికా తాజా నిర్ణయంతో పాకిస్తాన్ జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు మూడు నెలలు ఉండాలి. ఆ తర్వాత ట్రావెల్ పర్మిట్‌ను రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే అమెరికాలో ఉండగలరు. అలాగే హెచ్ వీసా (టెంపరరీ వర్క్ వీసా), ఐ వీసా (జర్నలిస్టులు, మీడియా వీసా) ఎల్ వీసా (ఇంటర్ కంపెనీ ట్రాన్సుఫర్ వీసా), ఆర్ వీసా (రిలీజియన్ వర్కర్స్ వీసా)లకు ఫీజును పెంచింది.

English summary
America-Pakistan-Business-Development-ForumThe United States has reduced visa validity for Pakistani citizens from five years to 12 months whereas journalists and media persons will not be allowed to stay in the country for over three months without renewing the travel permit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X