వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యరంగంలో మరో ముందడుగు: చర్మం నుంచి గుండె సంబంధిత అవయవాల సృష్టి

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఎంతో వృద్ధి చెందింది. తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు చర్మం నుంచి గుండె పనిచేసే కృత్రిమ యంత్రాలను కనుగొన్నారు. ఇది 3డీ బయో ప్రింటర్ ద్వారా కనుగొన్నారు. ఇది వైద్యరంగంలోనే ఓ కొత్త చరిత్ర అని శాస్త్రవేత్తలు చెప్పారు. ఏదో ఒక రోజున 3డీ బయో ప్రింటర్ ద్వారా ఇతర అవయవాలను కూడా తయారు చేస్తామనే విశ్వాసం వారు వ్యక్తం చేశారు.

శరీరంలోని అవయవాలు పనిచేసేందుకు అదే శరీరం నుంచి జీవసంబంధమైన పరంజాలను నిర్మాణం చేసి సిగ్నలింగ్ వ్యవస్థ ద్వారా అవయవాలు పనిచేసే టెక్నిక్‌ను కనుగొంటామని శాస్త్రవేత్తలు తెలిపారు. చర్మం నుంచి 3డీ ప్రింట్ ద్వారా గుండే నాళంను తయారు చేయొచ్చని తాము కనుగొన్నట్లు సైంటిస్టు ఆడం ఫీన్‌బర్గ్ తెలిపారు. అంతకుముందు ఎక్స్‌ట్రాసెల్యులార్ మాత్రికలు అని పిలువబడే ఈ పరంజాను ముద్రించడానికి చేసిన మునుపటి ప్రయత్నాలు కొన్ని పరిమితుల వల్ల అడ్డుకోబడ్డాయి, దీని ఫలితంగా కణజాల విశ్వసనీయత మరియు తక్కువ రిజల్యూషన్‌తో ఏర్పడ్డాయి.

US scientists built functional heart parts out of collagen,calls it a major breakthrough

ఇక ఈ తరహా అవయవాలు సృష్టించాలంటే చర్మం నుంచి తీసిన మెటీరియల్ వల్లే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి మానవుడి శరీరంలో చర్మం అనేది ఉంటుంది కాబట్టి అందులోని కణజాల నుంచి ద్రవంను తీసి ప్రింట్ చేసేందుకు ప్రయత్నించగా జెల్లో లాంటి మెటీరియల్ బయటకు వచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ కష్టాలన్నిటినీ కార్నెజీ మెల్లాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అధిగమించారు. ఇక ఈ టెక్నాలజీ అనుకున్నట్లుగా మంచి ఫలితాలు ఇస్తే ఏదో ఒకరోజున ఈ సాంకేతికత కచ్చితంగా గుండెసంబంధిత వ్యాధుల నుంచి బాధపడేవారికి భారీ ఊరటను ఇస్తుంది. ఈ సాంకేతికతో గుండె మార్పిడిలు కూడా చేయొచ్చని చెప్పారు. అయితే ముందుగా జంతువులలో ప్రయోగించి ఆ తర్వాత మానవుడిపై ప్రయోగం చేస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.

English summary
US scientists have successfully built functional heart parts out of collagen using a 3D bioprinter, a breakthrough they say could one day create entire organs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X