వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోస్త్ మేరా దోస్త్: భారత్‌తో రక్షణ ఒప్పందం బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం

|
Google Oneindia TeluguNews

Recommended Video

భారత్‌తో రక్షణ బంధం మరింత బలోపేతం చేసిన అమెరికా

భారత్‌తో రక్షణ బంధం మరింత బలోపేతం చేసుకునే దిశగా అమెరికా అడుగులు ముందుకు వేసింది. ఇందులో భాగంగా 716 బిలియన్ అమెరికన్ డాలర్లతో కుదిరిన ఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. రక్షణ విభాగంలో భారత్ తమకు ముఖ్యమైన దేశంగా అభివర్ణించిన అమెరికా... ఆ దేశం నుంచి అత్యాధునిక సాంకేతికత కలిగిన ఆయుధాలను కొనుగోలు చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం 2019 బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టింది.

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుకు మద్దతుగా 85 ఓట్లు రాగా 10 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. రక్షణ రంగంలో భారత్‌తో జతకట్టడమే కాకుండా టర్కీపై ఆంక్షలు కూడా ప్రతిపాదిస్తూ బిల్లులో పొందుపర్చింది. ఒకవేళ అమెరికా శతృదేశమైన రష్యా నుంచి టర్కీ ఎస్-400 డిఫెన్స్ వ్యవస్థను కొనుగోలు చేస్తే టర్కీపై ఆంక్షలు విధిస్తామని అమెరికా పేర్కొంది. టర్కీపై అమెరికా ఆంక్షలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే రష్యా నుంచి కూడా అదే డిఫెన్స్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేసేందుకు చర్చలు ప్రారంభించింది. మరోవైపు చైనా టెలికాం సంస్థ ZTE పై కూడా అమెరికా ఆంక్షలు విధించింది.

US Senate passes bill to strengthen defence ties with India

ఇదిలా ఉంటే బిల్లు చట్టంగా మార్పు చెందేముందు మరిన్ని సవరణలు చేయాల్సి ఉంది. అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ బిల్లును మరోవెర్షన్‌లో పాస్ చేసింది.అయితే సెనేట్ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌ మధ్య బిల్లుపై ఏకాభిప్రాయం కుదురుతుందో లేదో అనేది వేచి చూడాల్సిందే. రెండు హౌజ్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే వేర్వేరుగా బిల్లుపై ఓటింగ్ జరిపి... చివరిగా ఆమోదం కోసం బిల్లును ట్రంప్ దగ్గరకు పంపడం జరుగుతుంది.

English summary
The US Senate on Tuesday, June 19, passed a defence bill worth $716 billion seeking to strengthen Washington's defence ties with New Delhi.The US designated India as a "Major Defence Partner" in 2016 and it permitted the latter to buy advanced and sensitive technologies from the former.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X