వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు ఊరట: రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

|
Google Oneindia TeluguNews

రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలుపై ఆయా దేశాలపై అమెరికా విధించిన ఆంక్షలను సడలిస్తూ తీసుకొచ్చిన నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ 2019 బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో భారత్‌లాంటి దేశాలకు ఊరట లభించింది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం కోసం బిల్లును వైట్‌హౌజ్‌కు పంపించారు. ట్రంప్ ఆమోదం తెలిపితే బిల్లు చట్టంలా మారుతుంది.

ప్రస్తుతం బిల్లులో పొందుపర్చిన అంశాలతో పాటు కొత్త బిల్లులో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ప్రతిపాదించిక కొత్త బిల్లులో అమెరికా మిత్రదేశాలతో సంబంధాలు కొనసాగించాలా లేదా అనేది అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఉంది. అంతేకాదు ఆ దేశ మిలటరీ నిర్వహణ, సున్నితమైన సాంకేతిక అంశాలు కూడా అధ్యక్షడే ధృవపరచాల్సి ఉంటుందని బిల్లులో మార్పులు చేశారు.

US Senate passes bill to waive sanctions against India for buying Russian arms

ఇదిలా ఉంటే బిల్లులో వినియోగించిన పదజాలం కాస్త క్లిష్టతరంగా ఉంది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేస్తున్న దేశాలపై ద్వితీయ ఆంక్షలు కాంగ్రెస్ విధించినట్లుగా అనిపిస్తోంది. వాస్తవానికి అక్కడ వినియోగించిన భాష చూస్తే ఇందులో చాలా లిటిగేషన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ లూప్ హోల్స్ భారత్‌కు కలిసొచ్చేలా ఉన్నాయి.

బిల్లులో పొందుపర్చిన అంశాలను వాటి భాషను చూస్తే కొన్ని లొసుగులు భారత్‌కు కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి. ఒక దేశం అమెరికా ప్రభుత్వానికి సహకరిస్తూ ఆ దేశ వ్యూహాత్మ జాతీయ భద్రతపై
అమెరికా దేశం వ్యూహాత్మక జాతీయ భద్రతపై ఒక మిత్ర దేశం సహకరించేలా కొత్త బిల్లును పొందుపర్చింది. ఆ అంశాన్ని అధ్యక్షుడు ధృవీకరించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇదివరకున్న CAATSA కాట్సా చట్టాన్ని కూడా NDDA-2019లో సవరించారు. కాట్సా చట్టం 2017లో చేస్తే 2018లో అమల్లోకి వచ్చింది.

కాట్సా చట్టం ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఇతర అమెరికా మిత్రదేశాలు రష్యాకు సహకరించకూడదని... ఆదేశంతో ఎలాంటి లావాదేవీలు జరపరాదని పేర్కొంటూ ఆంక్షలు విధించింది. ఇది భారత్‌కు కాస్త అడ్డంకిగా నిలిచింది. కాట్సా చట్టం అమలులోకి రాకముందే రష్యా దగ్గర నుంచి భారత్ ఐదు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం‌ను కొనుగోలు చేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. కానీ తాజాగా చట్టాన్ని సవరించడంతో భారత్‌కు ఊరట లభించినట్లయ్యింది.

English summary
In a relief for India, the US senate on Wednesday passed a defence spending bill that also seeks to amend another law that threatens secondary sanctions against countries such as India which conduct “significant” business with Russia if New Delhi went ahead with plans to buy Russian air defence systems.The bill, called the National Defense Authorization Act (NDAA) 2019, had already been passed in the House of Representatives and is now headed for President Donald Trump for his signature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X