వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్ : హెచ్4 వీసా రద్దు ప్రక్రియలో పెరిగిన స్పీడ్

|
Google Oneindia TeluguNews

హెచ్ 4 వీసాదారులకు అమెరికా సర్కారు షాక్ ఇచ్చింది. హెచ్1 బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే ఈ వీసా రద్దు ప్రక్రియలో స్పీడు పెంచింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ చర్యలు ముమ్మరం చేసింది. హెచ్ 4వీసాల రద్దుపై ప్రజాభిప్రాయ సేకరణకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ సిద్ధమైంది. ఒకవేళ ప్రజలు ఈ వీసాల రద్దుకు మొగ్గుచూపితే భారత టెకీలు తీవ్రంగా నష్టపోనున్నారు.

మోదీ కంగ్రాట్స్ : డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో విజయం తర్వాత విష్ చేసిన పెద్దన్నమోదీ కంగ్రాట్స్ : డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో విజయం తర్వాత విష్ చేసిన పెద్దన్న

హెచ్ 4 వీసా అంటే?

హెచ్ 4 వీసా అంటే?

అమెరికాలో హెచ్ 1బీ వీసాలపై పనిచేస్తున్న వ్యక్తుల జీవిత భాగస్వాములు, వారి 21ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు హెచ్ 4 వీసా ఇస్తారు. ఈ వీసా ద్వారా వారు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది. 2015లో అప్పటి ఒబామా సర్కారు హెచ్ 4 వీసాలు ప్రవేశపెట్టింది. అమెరికాలో సాంకేతిక నిపుణుల కొరత ఉండటంతో ఆ లోటు భర్తీ చేసుకునేందుకు ఒబామా ప్రభుత్వం హెచ్ 4వీసాలను తెరపైకి తెచ్చింది. దీంతో పలు సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో హెచ్ 1బీ వీసాదారుల భార్య లేదా భర్తలు కూడా ఉద్యోగం చేసే అవకాశం దొరికింది.

హెచ్ 4 వీసా రద్దుకు ట్రంప్ మొగ్గు

హెచ్ 4 వీసా రద్దుకు ట్రంప్ మొగ్గు

హెచ్ 4వీసాల వల్ల చైనా, భారత్ తదితర దేశాలకు చెందిన వారు లాభపడుతున్నారని, స్థానికులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2017లో అధికారం చేపట్టిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒబామా సర్కారు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గతేడాది ఫిబ్రవరిలో హెచ్ 4 వీసా రద్దు ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. 2018 అక్టోబర్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కూడా ఈ ప్రతిపానకు ఓకే చెప్పడంతో హెచ్ 4 వీసాదారుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది.

వీసా రద్దుపై ప్రజాభిప్రాయ సేకరణ

వీసా రద్దుపై ప్రజాభిప్రాయ సేకరణ

ట్రంప్ నిర్ణయం మేరకు హెచ్ 4 వీసా రద్దు ప్రతిపాదనపై ప్రజాభిప్రాయం సేకరించాల్సిందిగా అమెరికా ప్రభుత్వం మే 22న డీహెచ్ఎస్‌కు నోటీసులు పంపింది. ఈ మేరకు చర్యలు వేగవంతం చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రతిపాదనకు మద్దతు లభిస్తే దాన్ని ఫెడర్ రిజిస్టర్‌లో పోస్ట్ చేస్తారు. అనంతరం 30 నుంచి 60 రోజుల్లో ప్రజలు తమ అభిప్రాయాలు పోస్ట్ చేసేందుకు అనుమతిస్తారు. వాటన్నింటినీ క్రోడీకరించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

భారతీయులపై తీవ్ర ప్రభావం

భారతీయులపై తీవ్ర ప్రభావం

హెచ్ 4వీసా రద్దయితే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న లక్ష మందికిపైగా భారతీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. 2015 నుంచి ఇప్పటి వరకు 1.2లక్షల వీసాలు మంజూరు కాగా.. వాటిలో 90 శాతం ఇండియన్లు దక్కించుకున్నారు. హెచ్ 4వీసాపై పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. అయితే ఈ వీసా రద్దయినా ఆ నిర్ణయం అమలుకు కనీసం సంవత్సరం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. హెచ్ 4 రద్దుతో అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలకు నిపుణులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు.

English summary
America begun the process to ban work permits for spouses of H-1B visa holders, a move that would affect the families of thousands of Indian hi-tech workers in the US. The US government on May 22 issued a notice for the proposed rule-making that will kick in public consultations to ban the H-4 Visa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X