వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు హెచ్ 1 బీ వీసాలపై తప్పుడు సమాచారం ఇచ్చారా?

హెచ్ 1 బీ వీసా పొందుతున్న టెక్కీల్లో 80 శాతం మంది సగటు కంటే వేతనం పొందుతున్నారని అమెరికా ఉన్నతాధికారి తెలిపారు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాలో విదేశీ ఉద్యోగాలు పొందుతున్న 'హెచ్ 1 బీ' వీసాలపై తప్పుడు సమాచారం ఆధారంగానే ఈ 'వీసా'ల విధానంపై సమగ్ర దర్యాప్తునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారని ఆ దేశంలోని ప్రముఖ అధ్యయన సంస్థ పేర్కొన్నది.

అమెరికాలో ఔట్ సోర్సింగ్ విధులు నిర్వర్తిస్తున్న ఐటీ కంపెనీలు ప్రత్యేకించి భారత ఐటీ దిగ్గజాలు తక్కువ వేతనాలతో పనిచేస్తున్న టెక్కీలకు ఎక్కువగా 'హెచ్ 1 బీ' వీసా జారీచేస్తున్నారని విమర్శలు నెలల తరబడి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ 'బై అమెరికన్, హైర్ అమెరికన్' అనే ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారని తెలుస్తున్నది.

కానీ హెచ్ 1 బీ వీసా పొందుతున్న టెక్కీల్లో 80 శాతం మంది సగటు కంటే వేతనం పొందుతున్నారని అమెరికా ఉన్నతాధికారి తెలిపారు. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (ఎన్ఎఫ్ఎపీ) అధ్యయనం ప్రకారం తక్కువ వేతనాలతో పనిచేస్తూ 'హెచ్ 1 బీ' వీసా పొందుతున్న కార్మికుల్లో అతి తక్కువ మంది ఉంటారని తెలుస్తున్నది. తాజాగా హెచ్ 1 బీ వీసా జారీ కోసం 17 కంపెనీలకు అనుమతి నిరాకరించారు.

భారత టెక్కీల్లో అతి తక్కువ వేతనాలు పొందుతున్న వారు స్వల్పమే

భారత టెక్కీల్లో అతి తక్కువ వేతనాలు పొందుతున్న వారు స్వల్పమే

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక ‘ఐటీ' కంపెనీల అధినేతలకు నిద్రలేని రాత్రులు మిగిల్చింది. భారతీయ ఐటీ కంపెనీలు భారీగా ‘హెచ్ 1 బీ' వీసాలు జారీ చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పదేపదే విమర్శలు చేస్తూ వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాక ముందు అమెరికా కాంగ్రెస్‌లో పలు బిల్లులు ప్రవేశ పెట్టారు. ప్రత్యేకించి అమెరికాలో పని చేస్తున్న ఆ దేశ ఐటీ కంపెనీలతోపాటు భారతీయ ఐటీ దిగ్గజాల్లో పనిచేస్తున్న ‘హెచ్ 1 బీ', ‘ఎల్ 1' వీసాలు పొందకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. విదేశీయుల్లో హెచ్ 1 బీ వీసా పొందిన భారతీయులు చాలా తక్కువ మంది ప్రమాణాల కంటే తక్కువ వేతనాలు పొందుతున్నారని ఎన్ఎఫ్ఎపీ పేర్కొన్నది.

అమెరికా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలిలా

అమెరికా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలిలా

ఎన్ఎఫ్ఎపి అధ్యయనం ప్రకారం వాస్తవంగా హెచ్ 1 బీ వీసా పొందిన వారు తక్కువైతే అమెరికా కార్మిక శాఖ రూపొందించిన డేటా తప్పుల తడకగా చూపి హెచ్ 1 బీ వీసా పొందిన వారు ఎక్కువ మందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ గణాంకాలే కార్మికశాఖను తప్పుదోవ పట్టించాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హెచ్ 1 బీ వీసా కోసం వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువగా దాఖలు చేసిన దరఖాస్తుల సమాచారం ఆధారంగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్.. హెచ్ 1 బీ వీసా పొందుతున్న వారి సంఖ్య తేలిందని ఎన్ఎఫ్ఎపి పేర్కొన్నది. ప్రత్యేకించి యువకులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు పంపి ఉంటారని తెలిపింది. దీనివల్ల హెచ్ 1 బీ వీసా పొందుతున్న వారి సంఖ్య రెట్టింపు నుంచి మూడింతలకు పెరిగిందన్న దురభిప్రాయం నెలకొన్నది. అసలు గమ్మత్తైన విషయమేమిటంటే ప్రభుత్వోద్యోగాల్లో నియమితులైన వారికి మాత్రమే కనీస వేతనం నిబంధన వర్తిస్తుందని ఈ అధ్యయనం సారాంశం.

హెచ్ 1 బీ వీసాలపై ఎన్ఎఫ్ఎపి నివేదిక పరిస్థితి ఇలా

హెచ్ 1 బీ వీసాలపై ఎన్ఎఫ్ఎపి నివేదిక పరిస్థితి ఇలా

చట్ట ప్రకారం ఆయా కంపెనీలు చెల్లిస్తున్న కనీస వేతనాల వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ (డీవోఎల్) తన డేటాలో పేర్కొంటుంది. ఐటీ రంగంలో విద్యార్హతలు, అవసరాలకు అనుగుణంగా నియామకాలతోపాటు వేతనాలు ఉంటాయని ఎన్ఎఫ్ఎపి పేర్కొంది. దీనికి అదనంగా అనుభవం కూడా తోడవుతుంది. దీని ప్రకారం డీవోఎల్ ఇచ్చిన డేటాలో హెచ్ 1 బీ వీసా హోల్డర్ పొందిన వేతనం చాలా తక్కువ అని పేర్కొంది.

అధ్యయనం నిజమైతే...

అధ్యయనం నిజమైతే...

ఎన్ఎఫ్ఎపీ అధ్యయనం నిజమైతే.. హెచ్ 1 బీ వీసా విధానాన్ని సమీక్షించాలన్న ట్రంప్ వైఖరి అమెరికా ఐటీ రంగానికి తీరని నష్టం చేకూరుస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అమెరికాకు అవసరమైన ఐటీ నిపుణుల రాకపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. అదే జరిగితే అమెరికాలో ఔట్ సోర్సింగ్ పరిశ్రమ ఇబ్బందుల్లో పడినట్లేనని అంటున్నారు.

English summary
NEW DELHI: US President Donald Trump's order for a comprehensive review of the H-1B visa programme could well be based on wrong data.A controversy raged in the US for months about low-paid H-1B visa holders, mainly tech workers hired by Indian companies, taking away American jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X