వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా మిసైల్స్ ఒప్పందం: ఆంక్షలు తప్పవంటూ భారత్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

Recommended Video

US Threatens Sanctions Ahead Of India-Russia Missile Systems Deal

వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యా విషయంలో భారత్‌కు మరోసారి అమెరికా తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎస్ 400 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రష్యాకు చెందిన ఎస్ 400 మిసైల్స్ కొనుగోలు చేయొద్దని కొన్ని నెలలుగా భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది.

అయితే, తమ హెచ్చరికలను భేఖాతరు చేస్తూ చర్చలు జరుపుతోందనే నెపంతో అమెరికా.. భారత్‌పై తీవ్ర ఆగ్రహంగా ఉంది. కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వారం భారత్ సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలోనే ఎస్ 400 క్షిపణులకు సంబంధించి కొనుగోలు ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయొచ్చని తెలుస్తోంది.

US threatens sanctions ahead of India-Russia missile systems deal

ఈ నేపథ్యంలో భారత్‌కు అమెరికా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ భారత్ గనుక ఆ క్షిపణులను కొనుగోలు చేస్తే.. అమెరికా చట్టాల ప్రకారం భారత్‌పై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. కాగా, పాకిస్థాన్, చైనాల దూకుడుకు అడ్డుకట్ట వేయాలంటే ఎస్ 400 క్షిపణులు అవసరమని భారత రక్షణ దళాలు భావిస్తున్నాయి. దీంతో వీటి కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది.

పుతిన్ సంతకం చేయనున్న ఈ ఒప్పందం విలువ సుమారు 500కోట్ల డాలర్ల(రూ.36,500కోట్లు)ని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇదే క్షిపణిని రష్యా నుంచి కొనుగోలు చేసినందుకు చైనాపై ఇప్పటికే అమెరికా ఆంక్షలు విధించడం గమనార్హం.

English summary
The US on Wednesday urged its allies not to enter into transactions with Russia and warned that it would trigger American sanctions, a day after it was reported that India was planning to purchase multi-billion S-400 missile defense system from Moscow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X