వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడ్ న్యూస్: భారత్‌కు వెంటిలేటర్లు, మోడీ నా బెస్ట్ ఫ్రెండ్: డొనాల్డ్ ట్రంప్

|
Google Oneindia TeluguNews

భారత్‌, ప్రధాని మోడీతో తనకున్న అనుబంధాన్ని అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తం చేశారు. అమెరికా-భారత్ కలిసి కరోనా వైరస్‌ను ఎదుర్కొంటాయని చెప్పిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ కామెంట్లు చేశారు. అంతేకాదు భారత్‌కు వెంటిలేటర్లు సరఫరా చేస్తామని.. ప్రధాని నరేంద్ర మోడీ తనకు మంచి మిత్రుడని ట్రంప్ తెలిపారు. శనివారం క్యాంప్ డేవిడ్ వెళ్లేముందు మీడియా ప్రతినిధులతో ట్రంప్ ముచ్చటించారు.

Recommended Video

US to Donate Ventilators to India, Called Modi his Best Friend : Donald Trump
చైనాను మించి..

చైనాను మించి..

భారతదేశంలో కరోనా వైరస్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వైరస్ ఆవిర్భవించిన చైనాను ఇండియా క్రాస్ చేసింది. డ్రాగన్ కంట్రీలో 82 వేల 933 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. భారత్‌లో ఆ సంఖ్య 85 వేలుగా ఉంది. ఈ సమయంలో భారత్‌కు వెంటిలేటర్లు ఇస్తామని ఈ మేరకు ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ ఎన్ని వెంటిలేటర్లు ఇస్తామనే అంశాన్ని వైట్ హౌస్ కూడా ధృవీకరించలేదు.

 ట్రంప్ వినతి మేరకు

ట్రంప్ వినతి మేరకు

ట్రంప్ వినతి మేరకు గతనెలలో హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రను భారత్.. అమెరికా పంపించిన సంగతి తెలిసిందే. దాదాపు 50 మిలియన్ల ట్యాబ్లెట్లను పంపించింది. శుక్రవారం కూడా ట్రంప్.. భారత్‌ దేశాన్ని, ప్రధాని మోడీపై పొగడ్తల వర్షం కురిపించారు. భారత్ గొప్ దేశం అని, మోడీ తనకు మంచి ఫ్రెండ్ అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ఆగ్రాలో ట్రంప్ పర్యటించిన సంగతి తెలిసిందే. అమెరికా కాదు ఇతర దేశాల నుంచి కూడా వెంటిలేటర్లు భారత్ స్వీకరిస్తోందని వైట్ హైస్ సెక్రటరీ కైలి మెక్ నానీ తెలిపారు.

 కలిసి పోరాడుదాం..

కలిసి పోరాడుదాం..

కనిపించని వైరస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం.. తమతో భారత్ కలిసి వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృధ్దికి సహకరిస్తున్న భారతీయ అమెరిక్లను కూడా ట్రంప్ పొగడ్తలు కురిపించారు. ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు.

English summary
america President Donald Trump has announced that the US will donate ventilators to India, and called Prime Minister Narendra Modi his "good friend".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X