వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాపై పోరు: భారీ ఆర్థిక ప్యాకేజీకి రంగం సిద్ధం చేసిన ట్రంప్ సర్కార్.. ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

చైనాలోని వుహాన్ నగరంలో మూడు నెలల కిందట జన్మించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోంది. అతలాకుతలం చేస్తోంది. 190 దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. కరోనా మరణాలను అడ్డుకోలేక కొమ్ములు తిరిగిన దేశాలు సైతం చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా వైరస్ చెలరేగిపోతోంది. రోజురోజుకూ కరోనా వైరస్ మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. అంచనాలను మించిన విధ్వంసాన్ని కారణమౌతోంది. ఇక కరోనావైరస్ బారిన పడిన దేశాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. ఇందుకోసం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికా తన ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికై చర్యలు తీసుకుంది.

కరోనావైరస్ మహమ్మారి‌తో అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతినింది. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేందుకుగాను ఆర్థిక ఉద్దీపన బిల్లుపై యునైటెడ్ స్టేట్స్ సెనేటర్లు మరియు ట్రంప్ పరిపాలన అధికారులు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని వైట్ హౌస్ అధికారి ఎరిక్ ఉలాండ్ చెప్పారు. కొన్ని రోజులపాటు జరిగిన చర్చల ద్వారా ఒక ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పిన ఉలాండ్.. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం 2 ట్రిలియన్ డాలర్లతో ఆర్థిక ఉద్దీపన బిల్లుపై ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు.

US to pumps $2 trillion, after senate and Trump administration agree on stimulus plan

సెనేట్‌లో రిపబ్లికన్ల నేత మిట్చ్ మెక్‌కానెల్ సెనేట్‌లో ఈ ఒప్పందంపై పూర్తి వివరాలు చెబుతారని ఉలాండ్ చెప్పారు. ఇక కరోనావైరస్‌తో నష్టపోయిన పరిశ్రమలకు సాయం కింద 500 బిలియన్ డాలర్లు ఇవ్వాలని, అదే సమయంలో కరోనావైరస్‌తో కొన్ని లక్షల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని అట్టి వారికి 3వేల డాలర్లు ఆర్థిక సహాయం చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. ఇక వ్యాపారం కోసం చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్నవారికి 350 బిలియన్ డాలర్లు, నిరుద్యోగ భృతి కింద 250 బిలియన్ డాలర్లు, హాస్పిటల్స్‌కు 75 బిలియన్ డాలర్లను కేటాయించనుంది.

కరోనావైరస్ దెబ్బకు ఆర్థిక రంగం కకావిలకమైన నేపథ్యంలో ఈ ఆర్థిక ఉద్దీపన చర్యతో స్వాంతన చేకూర్చేందుకు ట్రంప్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకు అమెరికాలో కరోనావైరస్ బారిన పడి 660 మంది మరణించారు. దాదాపు 50వేల మంది చికిత్స పొందుతున్నారు. వాణిజ్యం ఎక్కడికక్కడ నిలిచిపోగా.. కొన్ని లక్షల మంది పనులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఉద్దీపన చర్యల కోసం విడుదల చేస్తున్న డబ్బులు అమెరికా దేశ భద్రతకు వినియోగించే బడ్జెట్‌ కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

English summary
US Congress and Trump administration agree to plan to protect economy from coronavirus containment measures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X