• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మదరాసీ కమలా హ్యారిస్ బ్రెడ్‌ను వండిన విధంబెట్టిదనిన..: రెసిపీ ఇదీ: స్పైసీ పోర్క్ సాసెజ్

|

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్.. వంటపనిలో బిజీగా గడిపేస్తున్నారు. తనకు ఇష్టమైన ఆహారాన్ని తన చేతులతో వండి తినేస్తున్నారు. మదరాసీ కమలా హ్యారిస్‌ తనకు ఇష్టమైన ఆహారం ఇడ్లీ, దోసె, సాంబార్ అంటూ ఇదివరకు చెప్పుకొచ్చినప్పటికీ.. అది కాదని తేలింది. తన ఫేవరెట్ ఫుడ్ ఏమిటో ఆమె స్పష్టం చేశారు. కార్న్‌బ్రెడ్‌ అంటే పడి ఛస్తానని పేర్కొన్నారు. కార్న్‌బ్రెడ్‌ను తన చేతులారా తయారు చేసుకుంటాననీ చెప్పారు. కార్న్‌బ్రెడ్ తయారీకి సంబంధించిన రెసిపిని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఎన్నికల ప్రచారంలో సివంగిలా..

ఎన్నికల ప్రచార సమయంలో రిపబ్లికన్ పార్టీ నేతలపై సివంగిలా విరుచుకుని పడిన డెమొక్రటిక్ క్యాండిడేట్ కమలా హ్యారిస్.. వంటగదిలో మాత్రం చాలా కూల్‌గా, క్యాజువల్‌గా కనిపించారు. ఓ సాధారణ గృహిణిలా కార్న్‌బ్రెడ్‌ను పకాయించారు. థ్యాంక్స్ గివింగ్‌లో భాగంగా తాను దీన్ని తన చేతులతో తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు. కార్న్‌బ్రెడ్‌ను ప్రిపేర్ చేయడం పెద్ద బ్రహ్మవిద్యేమీ కాదని, రెసిపికి అవసరమైన వస్తువులతో ఎవరైనా దాన్ని సులభంగా తయారు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

కార్న్‌బ్రెడ్‌ తయారీ కోసం..

కార్న్‌బ్రెడ్‌ తయారీ కోసం..

దీన్ని తయారీ కోసం కార్న్‌బ్రెడ్ మిక్స్, స్పైసీ పోర్క్ సాసెజ్, ఉల్లిపాయలు, యాపిళ్లు, మెంతి ఆకులు (కెలెరి స్టాక్స్), చికెన్ బ్రాత్ (సూప్), ఉప్పు లేని బటర్, కొత్తిమీర (పార్స్‌లే), సేజ్ లీఫ్ట్స్, థైమ్ లీఫ్స్, రోజ్‌మేరీ, కాసింత ఉప్పు, దానికి అవసరమైన మిరియాలను వినియోగించి కార్న్‌బ్రెడ్‌ను తయారు చేయొచ్చని కమలా హ్యారిస్ తెలిపారు. ఏ పదార్థాన్ని ఎంత పరిమాణంలో వినియోగించాలనే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

బేక్ చేయడం ఇలా..

బేక్ చేయడం ఇలా..

తొలుత- కార్న్‌బెడ్ బేక్ చేయాల్సి ఉంటుంది. దాని పాకెట్‌పై ఇచ్చిన డైరెక్షన్స్‌ను అనుగుణంగా బేక్ చేయాలి. చల్లారిన తరువాత దాన్ని ముక్కలు చేయాలి. అందులో సాసెజ్ ఫ్రైని మిక్స్ చేయాలి. మళ్లీ క్రంబుల్ చేయాలి. అనంతరం పాన్ మీది నుంచి దాన్ని బయటికి తీయాలి. ఇతర ఆహార పదార్థాలను పెనంలో వేడి చేయాలి. అవి ఉడికిన తరువాత.. యాపిల్‌ ముక్కలను వేయాలి. అనంతరం కార్న్‌బ్రెడ్‌లో సాసెజ్, వెగ్గీస్, బటర్, చికెన్ బ్రాత్‌తో బాగా కలపాలి, అనంతరం 375 ఫారిన్ హీట్ వద్ద 40 నిమిషాల పాటు వేడి చేయాలి.

వంట చేయడంలోనే హాయి..

వంట చేయడంలోనే హాయి..

తనకు వంట చేయడంలో ఉన్నంత హాయి మరెక్కడా దొరకదని కమలా హ్యారిస్ చెప్పుకొచ్చారు. ఎంత కష్టమైనా సరే.. వంట వండటానికే ఇష్టపడతానని అన్నారు. ఈ ఏడాది తన జీవితాన్ని మలుపు తిప్పిందని, అందుకే తన కుటుంబానికి ఇష్టమైన థ్యాంక్స్ గివింగ్ రెసిపిని అందరితో పంచుకోవాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కార్న్‌బ్రెడ్‌ను తయారు చేయడమే కాకుండా డిన్నర్‌ చేయడానికి డైనింగ్‌ టేబుల్‌ను కూడా ఆమె సర్దారు. దానికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశారు.

English summary
US Vice President-elect Kamala Harris has spoken of her love for cooking time and again. With Thanksgiving approaching, she took to social media to reveal one of her family's favourite Thanksgiving recipes cornbread dressing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X