వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో విద్యాభ్యాసం: వీసా డే ఎప్పుడంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్ 6వ తేదిన వీసా డే నిర్వహించనున్నట్టు అమెరికా కాన్సులేట్ జనరల్ జార్జి హెచ్ హూగ్మన్ గురువారం నాడు ప్రకటించారు. వీసా ఇంటర్వ్యూ సమయంలో అధికారులు అడిగే ప్రశ్నలకు అభ్యర్ధులు జాగ్రత్తగా సమాధానాలు చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికాలో చదువుతున్న ప్రతి ఆరుగురు విదేశీ విద్యార్ధుల్లో ఒకరు భారత్ నుండి వచ్చిన వారే ఉన్నారని గణాంకాలు తెలుపుతున్నాయి జూన్ 6న ఢిల్లీలోని అమెరికా ఎంబసీ సహ హైద్రాబాద్, చెన్నై, కోల్‌కతా, ముంబైలోని అమెరికా కాన్సులెట్లలో అమెరికాలో ఉన్నత విద్యను అబ్యసించేందుకు వచ్చిన ధరఖాస్తులను అమెరికా అధికారులు పరిశీలిస్తారు.

US Visa Day on June 6, consul-general announces

అమెరికాలో ప్రస్తుతం 1,86,000 మంది విద్యార్ధులు ఉన్నారని అమెరికా అధికారులు ప్రకటించారు. అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్ధుల్లో అత్యధికులు ఇండియాకు చెందినవారేనని అమెరికా అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

వీసా ఇంటర్వ్యూ కోసం సుమారు 30 నిమిషాల సమయం తీసుకొంటారు. ఎందుకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాను ఎంచుకొన్నారనే విషయమై ఆరా తీస్తారు.వీసా అందరికి దక్కుతోందనే గ్యారంటీ ఎవరికీ లేదు. అయితే ఎవరికీ కూడ వీసా దక్కదనే నియమం కూడ లేదని అధికారులు చెబుతున్నారు.

ఇంటర్వ్యూల సమయంలో విద్యార్ధుల సమాధానాల ఆధారంగా వీసాలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే వీసాలు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే వారిని నమ్మే పరిస్థితిని విడనాడాలని అమెరికన్ అధికారులు చెబుతున్నారు.

వీసా ఇంటర్వ్యూల సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఒకవేళ విద్యార్ధులు తప్పుడు సర్టిఫికెట్లను అందిస్తే వారిపై నిషేధం విధిస్తారు.

English summary
Announcing the Visa Day for this year on June 6, US Consul-General George H Hogeman today advised students to "listen carefully" to the questions asked during the visa interview and reply them with "real answers".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X