• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనాకు అమెరికా హెచ్చరిక: ఈసారి మసూద్‌కు మద్దతు ఇస్తే ఖబడ్దార్..!

|

వాషింగ్టన్ : పుల్వామా దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ జైషేమహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యభద్రతా మండలిలో పలు శాశ్వత సభ్య దేశాలు యోచిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా చైనా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. నిబంధనల ప్రకారం శాశ్వతసభ్యత్వం ఉన్న అన్ని దేశాలు తమ అభిప్రాయం తెలిపితేనే అది చెల్లుతుందని చైనా వాదిస్తోంది. ఇక తీర్మానం పాస్ చేసేందుకు మరికొద్ది గంటల మాత్రమే సమయం ఉంది.

డ్రాగన్ గేమ్ : మసూద్ అజార్‌ను మరోసారి వెనకేసుకొచ్చిన చైనా..తెరపైకి కొత్త కథ

మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చి అతనిపై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను 1267 ఆంక్షల కమిటీ ముందు ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ దేశాలు ఫిబ్రవరి 27న తీసుకొచ్చాయి. అయితే ఉగ్రవాదంను సహించేది లేదంటూ చైనా చెబుతూనే మరోవైపు మాత్రం అజార్‌కు అండగా నిలుస్తుండటం అమెరికాకు ఎంతమాత్రం రుచించడం లేదు. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికా చైనా తీరును తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

US warns China over blocking U.N. listing of Masood Azhar as global terrorist

మసూద్ అజార్‌పై ఆంక్షల అంశంపై ఈ సారి చైనా అడ్డుకుంటే బాగుండదని హెచ్చరించింది. మసూద్ అజార్ ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్‌ను నడుపుతున్నారని ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలని చైనాను సూటిగా ప్రశ్నించారు అమెరికా విదేశాంగా ప్రతినిధి రాబర్ట్ పాలాడినో. మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని అన్నారు పాలడినో.

ప్రాంతీయ స్థిరత్వం, శాంతి నెలకొనేలా రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని అదే సమయంలో అజార్‌పై ఆంక్షలు విధించకపోతే మానవాళికి ప్రమాదంగా మారే అవకాశముందని పాలిడినో అన్నారు. భారత విదేశాంగా కార్యదర్శి విజయ్ గోఖలే అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంగా పాలిడినో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.గోఖలే అమెరికా విదేశాంగ కార్యదర్శి డేవిడ్ హేల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఉగ్రవాదంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The United States has said that Jaish-e-Mohammad (JeM) is a threat to regional stability and peace and that China preventing the United Nations from designating JeM leader Masood Azhar as an international terrorist will run counter to the US and China’s shared goals for stability.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more