వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు అమెరికా హెచ్చరిక -ట్రంప్ చివరి బాంబు -టర్కీపై ఏకంగా ఆంక్షలు -రష్యన్ S400 క్షిపణుల రచ్చ

|
Google Oneindia TeluguNews

పేరుకు డెమోక్రాట్లు, రిపబ్లికన్లు అనే తేడాలేగానీ, ఇతర దేశాలతో వ్యవహారాల్లో అమెరికా తీరు ఎప్పటికీ మారదు. భారత్ లాంటి దేశాలను అది కేవలం మార్కెట్లుగా భావిస్తుందే తప్ప స్నేహితులుగా కానేకాదు. ఇప్పటిదాకా ట్రంప్ తెంపరితనం గురించి మాట్లాడుకున్న మనం ఇకపై బైడెన్ మెలిక రాజకీయాలను చూడబోతున్నాం. తాము తయారు చేసిన ఆయుధాలను మాత్రమే మిగతా దేశాలన్నీ కొనాలని, లేకుంటే ఆంక్షలకు దిగుతామని భయపట్టే అమెరికా మరోసారి అన్నంత పని చేసింది. రష్యా తయారుచేసిన అత్యాధునిక ఎస్400 క్షిపణి వ్యవస్థలను కొన్నందుకు టర్కీపై ఆంక్షలు విధింగా, అవే మిస్సైళ్లను కొనబోతున్న ఇండియాకు అగ్రరాజ్యం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

భరతమాతకు బ్రిటిష్ ప్రధాని వందనం -రిపబ్లిక్ డే-2021కు చీఫ్ గెస్ట్‌గా బోరిస్ జాన్సన్ -మోదీకి రిటర్న్ గిఫ్ట్భరతమాతకు బ్రిటిష్ ప్రధాని వందనం -రిపబ్లిక్ డే-2021కు చీఫ్ గెస్ట్‌గా బోరిస్ జాన్సన్ -మోదీకి రిటర్న్ గిఫ్ట్

 టర్కీపై ఆంక్షలు

టర్కీపై ఆంక్షలు

రష్యా అభివృద్ధి చేసిన ‘ఎస్-400 ట్రిమ్ఫ్ యాంటీ మిస్సైల్ సిస్టమ్' పంచంలోనే ది బెస్ట్ గగనతల రక్షణ వ్యవస్థగా పేరు పొందింది. వారి వారి అవసరాల మేరకు పలు దేశాలు కొనుగోళ్లపై ఆసక్తి చూపాయి. భారత్ సహా టర్కీ ఇప్పటికే ఎస్‌- 400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేశాయి. ఈ కారణంగానే టర్కీపై అమెరికా ఆంక్షలు విధించింది. టర్కీపై ఆంక్షలు విధించినట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్‌ పాంపియో సోమవారం ప్రకటించారు. మిగతా దేశాలేవీ రష్యాతో ఎస్-400 లావాదేవీలు నిర్వహిస్తే సహించబోమని అమెరికా స్పష్టం చేసింది. అదే సమయంలో..

 భారత్‌కు అమెరికా వార్నింగ్

భారత్‌కు అమెరికా వార్నింగ్

రష్యా నుంచి ఎస్-400 మిస్సైల్ వ్యవస్థను కొనుగోలుచేసిన టర్కీపై ఆంక్షల విధింపు ప్రకటనలోనే భారత్ కు కూడా అమెరికా తీవ్ర హెచ్చరిక చేసింది. ర‌ష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయ‌కూడ‌ద‌ని వార్నింగ్ ఇచ్చింది. ర‌ష్యా నుంచి ఎస్‌400 ట్రింఫ్ యాటీ మిస్సైల్ వ్య‌వ‌స్థ‌ను ఇప్పటికే కొనుగోలు చేసిన భారత్ పై అమెరికా అసహనం వ్యక్తం చేసింది. మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా జోబైడెన్ బాధ్యతలు చేపట్టనుండగా, ప్రస్తుత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ విధంగా టర్కీపై చర్యలకుదిగి, భారత్ కు వార్నింగ్ ఇవ్వడం ప్రపంచ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నది.

 ఎస్‌-400 క్షిపణు కొంటే అంతే..

ఎస్‌-400 క్షిపణు కొంటే అంతే..

రష్యా తయారుచేసిన ఎస్-400 ట్రిమ్ఫ్ యాంటీ మిస్సైల్ సిస్టమ్ ను మిగతా దేశాలేవీ కొనొద్దని వార్నింగ్ ఇస్తోన్న అగ్రరాజ్యం.. అమెరికాస్ అడ్వ‌ర్స‌రీస్ త్రూ సాంక్ష‌న్స్ యాక్ట్ (సీఏఏటీఎస్ఏ) కింద ట‌ర్కీపై ప‌లు ఆంక్ష‌లు విధించిన‌ట్లు, భారత్ ను హెచ్చరించినట్లు ప్ర‌క‌టించారు. ఇంట‌ర్నేష‌ల్ సెక్యూరిటీ అండ్ నాన్‌ప్రోలిఫ‌రేష‌న్ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ క్రిస్టోఫ‌ర్ ఫోర్డ్‌ ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ చ‌ట్టం కింద ట‌ర్కీకి చెందిన మిలిట‌రీ ఆయుధాల సేక‌ర‌ణ సంస్థ ఎస్ఎస్‌బీ, న‌లుగురు అధికారుల‌పై అమెరికా ఆంక్ష‌లు విధించింది. భారత్ సహా మిగతా దేశాలన్నీ ఈ చర్యను హెచ్చరికగా తీసుకొని.. ర‌ష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్ల‌ను పూర్తిగా నిలిపేయాల‌ని, లేదంటే సీఏఏటీఎస్ఏ సెక్ష‌న్ 231 కింద ఆంక్ష‌లు త‌ప్ప‌వ‌ని అమెరికా పేర్కొంది.

ట్రంప్ బాటలోనే బైడెన్.. యాంటీ రష్యా

ట్రంప్ బాటలోనే బైడెన్.. యాంటీ రష్యా

ప్రస్తుతం టర్కీపై అమెరికా ఆంక్షలకు కారణమైన ఎస్400 యాంటీ మిస్సైల్ వ్యవస్థను ఇండియా కూడా పొందనుంది. ఐదు ఎస్‌400 యాంటీ మిస్సైల్ వ్య‌వ‌స్థల‌ కోసం 543 కోట్ల డాల‌ర్ల‌తో భారత్ 2018లోనే రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ను అమెరికా వ్య‌తిరేకిస్తున్నా.. ఆంక్ష‌లు విధిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నా.. భార‌త ప్ర‌భుత్వం మాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు. మ‌రోవైపు అమెరికా కూడా ఇండియాకు ఆయుధాల‌ను విక్ర‌యిస్తూనే ఉంది. గ‌తేడాది ఇండియాకు వ‌చ్చిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. 350 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 24 సికోర్క్సీ ఎంహెచ్‌-60ఆర్ సీ హాక్ హెలికాప్ట‌ర్లు, ఆరు బోయింగ్ ఏహెచ్‌-64ఈ అపాచీ గార్డియ‌న్ అటాక్ హెలికాప్ట‌ర్ల‌ను భార‌త్‌కు అమెరికా విక్ర‌యించ‌నుంది. ఈ సీఏఏటీఎస్ చ‌ట్టాన్ని ప‌లువురు డెమొక్రాట్లు కూడా మ‌ద్ద‌తిస్తుండ‌టంతో జో బైడ‌న్ హ‌యాంలోనూ ర‌ష్యా నుంచి ఆయుధాల కొనుగోలు విష‌యంలో అమెరికా వైఖ‌రిలో ఎలాంటి మార్పూ ఉండ‌క‌పోవ‌చ్చు.

జగన్ సోషల్ సైన్యం భారీ కుట్ర -జనం సొమ్ముతో రాక్షసం -ఖబడ్దార్ వెధవల్లారా: ఎంపీ రఘురామ సంచలనంజగన్ సోషల్ సైన్యం భారీ కుట్ర -జనం సొమ్ముతో రాక్షసం -ఖబడ్దార్ వెధవల్లారా: ఎంపీ రఘురామ సంచలనం

English summary
Days ahead of President-elect Joe Biden taking charge as the new President of the US, the Trump administration has imposed sanctions on Turkey for buying the Russian-made S400 Triumf anti-missile system and has warned India and other countries on buying arms manufactured by Russia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X