వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదం అణిచివేతకు పాకిస్తాన్‌పై ఒత్తిడి కొనసాగుతుంది: అమెరికా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్ : కశ్మీర్‌లో ఉగ్రవాదులు హింసను ప్రోత్సహిస్తే వారు కశ్మీరీలకు పాకిస్తానీలకు శతృవులే అని ఇమ్రాన్‌ఖాన్ చేసిన వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నట్లు అమెరికా పేర్కొంది. అదే సమయంలో ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకునేలా పాకిస్తాన్‌పై ఒత్తిడి కొనసాగిస్తామని అగ్రరాజ్యం వెల్లడించింది. లష్కరే తొయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్‌లు పాక్ గడ్డపై నుంచి ఉగ్రవాదం నెరుపుతున్నారని ఆ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా తెలిపింది.

ఈ మధ్యకాలంలోనే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఉగ్రవాదంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో హింసను ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదులు భారత్‌కు మాత్రమే శతృవులు కాదని కశ్మీరీలకు పాకిస్తానీలకు కూడా శతృవులే అని చెప్పారు. అయితే ఉగ్రవాదంకు పాకిస్తాన్ మద్దతుగా నిలవడంతోనే భారత్ పాక్‌ల మధ్య జరగాల్సిన చర్చలు ఆగిపోతున్నాయని దక్షిణ మరియు మధ్యాసియా దేశాల తాత్కాలిక అసిస్టెంట్ సెక్రటరీ ఆలీస్ వెల్స్ చెప్పారు.

US warns Pak to act strict on Terrorism

భారత్ పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అమెరికా 1072 సిమ్లా ఒప్పందం గురించి ప్రస్తావించింది అమెరికా. పాకిస్తాన్ లష్కరే తొయిబా, జైషే మహ్మద్, ఇతర ఉగ్రవాద సంస్థలను తమ గడ్డపై పెంచి పోషిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దు రేఖ వద్ద ఈ ఉగ్రవాద సంస్థలు అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని వీటిని కట్టడి చేయాలంటూ పాకిస్తాన్‌ను హెచ్చరించింది.

అంతేకాదు పాకిస్తాన్ మానవహక్కుల ఉల్లంఘనలకు కూడా పాల్పడుతోందని అమెరికా హెచ్చరించింది. వీటన్నిటినీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఉందని తీవ్ర హెచ్చరికలు జారీచేసింది.

English summary
The US has once again reiterated that it will continue to pressurise Pakistan to act against terrorism breeding on its ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X