వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ బాంబు: H4 వీసాలను రద్దు చేసే యోచనలో ట్రంప్ సర్కార్..భారతీయులపై అధిక ప్రభావం

|
Google Oneindia TeluguNews

ట్రంప్ సర్కార్ మరో బాంబు పేల్చింది. రానున్న మూడునెలల్లో హెచ్-4 వీసాలను రద్దు చేయనున్నట్లు ఫెడరల్ కోర్టుకు తెలిపింది. విదేశాల నుంచి అమెరికాకు హెచ్-1బీ వీసా దారుల భర్తలు కానీ భార్యలు కానీ ఎక్కువగా హెచ్-4 వీసాలు కలిగి ఉంటారు. శనివారం డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలోని కోర్టులో అమెరికా హోమ్‌శాఖ పిటిషన్ దాఖలు చేసింది. హెచ్-4 వీసాలను రద్దు చేసేందుకు కార్యాచరణ ప్రారంభమైందని మూడునెలల సమయంలో ఇది పూర్తి అవుతుందని కోర్టుకు హోమ్‌శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన కొత్త నిబంధనలను వైట్ హౌజ్‌లోని బడ్జెట్ నిర్వహణ కార్యాలయానికి మరో మూడునెలల సమయంలో అందిస్తామని స్పష్టం చేసింది. సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ హెచ్-4 వీసాలను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించడంతో హోంశాఖ ఈమేరకు వివరణ ఇచ్చింది. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచాలని కోరింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలో హెచ్-4 వీసా దారులు ఉద్యోగాలు పొందే విధానం వచ్చిందని దీంతో స్థానికంగా ఉన్న తమకు ఉద్యోగాలు లేకుండా పోయాయని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ ఆరోపించింది. ట్రంప్ వచ్చాక హెచ్-4 వీసాదారులకు పని పరిమితులు రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు బహిరంగంగానే ప్రకటించింది కూడా. ఇదే విషయాన్ని కోర్టుకు కూడా తెలిపింది. ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే భారతీయులపైనే ప్రభావం ఎక్కువగా చూపనుంది.

US work permits to H4 visa holders may be revoked in 3 months, Indians affected

ఇప్పటికే మూడు అవకాశాలు ఇచ్చినప్పటికీ ట్రంప్ సర్కార్ విధానాలను రూపొందించలేదని త్వరగా కార్యాచరణ రూపొందించాలని సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ పిటిషన్‌లో పేర్కొంది. అమెరికా ప్రభుత్వం ఆలస్యం చేసేకొద్దీ స్థానికంగా ఉండే తాము ఉద్యోగాలకు దూరం అవుతున్నట్లు ఆ సంస్థ కోర్టుకు తెలిపింది. కాబట్టి త్వరగా నిర్ణయాన్ని వెల్లడి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోర్టును కోరింది సేవ్ జాబ్స్ యూఎస్ఏ సంస్థ.

డిసెంబర్ 25, 2017లో యూఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ హెచ్-4 వీసాదారులకు సంబంధించి 1,26,853 ఉద్యోగ అప్లికేషన్లకు ఆమోదం తెలిపింది. ఇందులో 93శాతం దరఖాస్తులు భారతీయులవే ఉండటం విశేషం. ఐదుశాతం చైనాకు చెందిన అప్లికేషన్లు ఉన్నట్లు సమాచారం. మిగతా ప్రపంచ దేశాలకు చెందిన వారివి 2శాతం మాత్రమే ఉన్నాయి.

English summary
The Trump administration Saturday told a federal court that its decision to revoke work permits to H-4 visas holders, who are primarily spouses of H-1B foreign guest workers, is expected within the next three months.The Department of Homeland Security (DHS) in its latest court filing Saturday told the US District Court in District of Columbia that it was “making a solid and swift progress in proposing to remove from its regulations certain H-4 spouses of H-1B nonimmigrants as a class of aliens eligible for employment authorisation”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X