• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హంజాను పట్టిస్తే 7కోట్ల రివార్డు ప్రకటించిన అమెరికా .హంజా పౌరసత్వం రద్దు చేసిన సౌదీ అరేబియా

|

భారత్ పై జరిగిన పుల్వామా ఉగ్రదాడి తరువాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆల్ ఖైదా పేరు మరోసారి తెరమీదకొచ్చింది. ఒసామా బిన్ లాడెన్ మరణానంతరం ఆల్ ఖైదా కార్యాకలాపాలను లాడెన్ కుమారుడు చూస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో అగ్ర దేశమైన అమెరికా లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ ఆచూకీ చెబితే 7 కోట్ల రివార్డ్ ఇస్తానని ప్రకటించింది. దీంతో సౌదీ అరేబియా తమ దేశ పౌరుడిగా ఉన్న హింజా బిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

లాడెన్ కుమారుడి ఆచూకీ చెప్తే ... 7 కోట్ల రివార్డు ప్రకటించిన అమెరికా

లాడెన్ కుమారుడి ఆచూకీ చెప్తే ... 7 కోట్ల రివార్డు ప్రకటించిన అమెరికా

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్.. ఈ పేరు చెప్తేనే అగ్ర దేశమైన అమెరికా సైతం భయపడుతుంది. సెప్టెంబర్ 11, 2001లో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని కూల్చివేసిన ఘటన గుర్తొస్తుంది. అగ్ర దేశానికే సవాల్ విసిరిన ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా అంతమొందించినప్పటికీ చాపకింద నీరులా ఆల్ ఖైదా కార్యాకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తండ్రి స్థానంలో ఆల్ ఖైదా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడంటూ అగ్ర దేశమైన అమెరికా లాడెన్ 15వ కుమారుడైన హంజా బిన్ లాడెన్ ఆచూకీ చెబితే 7కోట్ల రివార్డు ఇస్తామని ప్రకటించింది.

హంజా పౌరసత్వం రద్దు చేసిన సౌదీ ... హంజా ఆచూకీ కోసం ప్రయత్నం

హంజా పౌరసత్వం రద్దు చేసిన సౌదీ ... హంజా ఆచూకీ కోసం ప్రయత్నం

అగ్ర దేశమైన అమెరికా తీసుకున్న నిర్ణయంతో సౌదీ అరేబియా సైతం సంచలన నిర్ణయం తీసుకుంది. లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ప్రస్తుతం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.సౌదీ అరేబియా సర్కారుకు వ్యతిరేకంగా సౌదీ తెగల కోసం పోరాడుతున్న హంజా పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, సిరియా దేశాల్లో సంచరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ర దేశమైన అమెరికా అతని ఆచూకీ చెప్పాలంటూ 7 కోట్ల రివార్డు ప్రకటించడంతో ప్రస్తుతం లాడెన్ కుమారుడి పై చర్చ మొదలైంది.

సౌదీ కూడా కీలక నిర్ణయం తీసుకుని ఉగ్రవాదానికి తాము వ్యతిరేకం అని ప్రకటించింది. అమెరికా సైన్యం చేతిలో ఒసామా బిన్ లాడెన్ హతమయ్యాక ఇప్పటి వరకూ ఆల్‌ఖైదాకు నాయకుడు లేడు. ఇప్పుడు కొత్త వారసుడు వచ్చాడన్న ప్రచారం ముమ్మరమైంది. ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్‌కు అల్ ఖైదా పగ్గాలు అప్పగించారని వార్తలు షికార్లు చేస్తున్నాయి.

లాడెన్ సంతానంలో హంజా బిన్ లాడెన్ 15 వ వాడు... ఆల్ ఖైదాకు వారసుడు

లాడెన్ సంతానంలో హంజా బిన్ లాడెన్ 15 వ వాడు... ఆల్ ఖైదాకు వారసుడు

లాడెన్ కు ఉన్న 20 మంది సంతానంలో 15వ వాడైనా హంజా బిన్ లాడెన్ మూడో భార్య ఖైరియా సబర్ కుమారుడు.ఆమెకు ఉన్న సంతానంలో హమ్జా ఒక్కడే కుమారుడు. ఖైరియా అంటే ఒసామాకు ఎంతో ఇష్టం. సౌదీకి చెందిన ఆమె మహమ్మద్‌ ప్రవక్త కుటుంబానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలో హమ్జా తల్లిదండ్రుల వద్దే పెరిగాడు. మొదట సౌదీ అరేబియా, సుడాన్‌, ఆఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌లలో కూడా నివసించాడు. హంజా కు వివాహం అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం. అయితే, హంజా చిన్ననాటి ఫోటో మినహాయించి పెద్దయిన తర్వాత ఫోటో ఇప్పటివరకు బయటకు రాలేదు. కేవలం అతని చిన్ననాటి ఫోటోనే నిఘా వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది.

అయితే ఇప్పుడు అతను ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు. కానీ తండ్రి బాటలో జీహాద్ కు రాజు గా మారబోతున్నాడు అని మాత్రం సమాచారం . అతనితో తమ దేశానికి ముప్పు అని భావించిన నేపధ్యంలోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది .

English summary
After pulwama attacks in bharat With the latest developments US State Department says, A son of Osama bin Laden is emerging as a leader in al Qaeda, and it's willing to pay up to $1 million for information on his whereabouts.Hamza bin Laden, whose father Osama bin laden was killed by US is taking the reins of the terror group. Due to this Saudi Arabia has revoked Hamza bin Laden's citizenship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more