వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్‌కు షాక్: అణ్వాయుధ పరీక్షలు ఆపే ప్రసక్తి లేదు: ఉత్తరకొరియా

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ప్రపంచదేశాలన్నీ అడ్డుపడినా అణ్వాయుధ పరీక్షలు ఆపేది లేదని ఉత్తరకొరియా తేల్చిచెప్పింది. ఉత్తరకొరియా వ్యవహరశైలితో మూడవ ప్రపంచ యుద్దం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కిమ్‌కు షాక్: నార్త్ కొరియాపై బాంబు దాడి, సూపర్ బాంబు, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలుకిమ్‌కు షాక్: నార్త్ కొరియాపై బాంబు దాడి, సూపర్ బాంబు, బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వ్యవహరశైలిపై ప్రపంచ దేశాలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి, అమెరికా పలు దఫాలు ఉత్తర కొరియాను హెచ్చరించినా కిమ్ మాత్రం పట్టించుకోలేదు.

కిమ్‌కు ట్రంప్ షాక్: ఖండాంతర క్షిపణి ప్రయోగించిన అమెరికా,ఇక మాటల్లేవ్కిమ్‌కు ట్రంప్ షాక్: ఖండాంతర క్షిపణి ప్రయోగించిన అమెరికా,ఇక మాటల్లేవ్

అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణులు ప్రయోగిస్తోంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడ ఉత్తరకొరియాపై సీరియస్ చర్యలకు దిగుతున్నారు. న్యూక్లియర్ సూపర్‌బాంబును అమెరికా పరీక్షించింది.

అమెరికాకు షాక్: మరోసారి అణుపరీక్షలకు ఉత్తరకొరియా రె'ఢీ'అమెరికాకు షాక్: మరోసారి అణుపరీక్షలకు ఉత్తరకొరియా రె'ఢీ'

ఉత్తరకొరియా నిర్వహించినట్టుగానే అమెరికా కూడ ఖండాంతర క్షిపణిని నిర్వహించింది. దెబ్బకు దెబ్బ అనే రీతిలో అమెరికా కూడ వ్యవహరిస్తోంది. ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి ద్వారా ఉత్తరకొరియాపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఉత్తరకొరియా తగ్గడం లేదు.

అణ్వాయుధ పరీక్షలు ఆపబోం

అణ్వాయుధ పరీక్షలు ఆపబోం

అణ్వాయుధ పరీక్షలను ఆపబోమని ఐక్యరాజ్యసమితిలో ఉత్తరకొరియా ప్రతినిధి ప్రకటించారు., అమెరికా వద్ద ఎన్నో అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. అమెరికా వద్ద అణ్వాయుధాలుంటే తాము ఏనాడూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని ఉత్తరకొరియా గుర్తుచేసింది. అమెరికా రక్షణలో భాగంగా ఆదేశం అణ్వాయుధాలు తయారు చేసుకుందని చెప్పారు.

దేశ రక్షణ కోసమే అణ్వాయుధాలు తయారీ

దేశ రక్షణ కోసమే అణ్వాయుధాలు తయారీ

దేశ రక్షణకోసమే అణ్వాయుధాలు తయారు చేస్తామని ఉత్తరకొరియా ప్రకటించారు.ప్రజలను కాపాడుకోవడం ఆ దేశం హక్కు అని ఆయన తెలిపారు. అలాంటి హక్కే తమకు కూడా ఉందని ఆయన అన్నారు. అణ్వాయుధ తయారీ అనేది ఒక దేశ అంతర్గత విషమయని ఆయన స్పష్టం చేశారు.అమెరికా ఉత్తరకొరియాను చుట్టుముట్టి 40,000 మంది సైనికులను మోహరించి, తమ మనుగడను ప్రశ్నార్థకం చేసిందని ఆయన తెలిపారు.

బాలిస్టిక్ పరీక్ష నిర్వహిస్తే తప్పేంటీ?

బాలిస్టిక్ పరీక్ష నిర్వహిస్తే తప్పేంటీ?

బాలిస్టిక్ పరీక్షనిర్వహించడంలో తప్పేంటని ఉత్తరకొరియా ప్రశ్నించింది.అమెరికా వైఖరిని సహించలేక అణ్వాయుధ పరీక్షకు సిద్దమైనట్టు చెప్పారు. ఒక్క బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించినంత మాత్రాన అమెరికా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అయితే హద్దు మీరితే అమెరికాతో తలపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అందుకే ప్రపంచదేశాలతో తమ సంబంధాలు తెంచి, తమను ఒంటరి చేసినా...అణ్వాయుధాల తయారీ ఆపడం మాత్రం కుదరదని ఆయన తేల్చిచెప్పారు.

ఉత్తరకొరియా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి ఛాన్స్

ఉత్తరకొరియా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగానికి ఛాన్స్

ఉత్తరకొరియా మరో బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ఫ్రాన్స్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచదేశాలకు చాలా ప్రమాదకరమని ఫ్రాన్స్ విదేశాంగశాఖ హెచ్చరించింది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఉత్తరకొరియాను నిలువరించాలని సూచించింది. అది కేవలం చైనాకు మాత్రమే సాధ్యమవుతుందని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. అమెరికా, దక్షిణకొరియా, జపాన్ లను లక్ష్యం చేసుకుని ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తోందని, అది ప్రపంచానికి ఏమాత్రం క్షేమకరం కాదని తెలిపింది. భవిష్యత్ లో కూడా ఈ ఉద్రిక్తతలు కొనసాగితే యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఫ్రాన్స్ హెచ్చరించింది. చైనా వెంటనే ఉత్తరకొరియాతో మాట్లాడి క్షిపణి పరీక్షలు నిర్వహించకుండా నిలువరించాల్సిన అవసరం ఉందని ఫ్రాన్స్ అభిప్రాయపడింది. అమెరికాతో పాటు యూరోప్ దేశాలను చేరుకోగల క్షిపణి పరీక్షలను కూడా ఉత్తరకొరియా చేస్తోందని ఫ్రాన్స్ ఆందోళన వ్యక్తం చేసింది.

English summary
North Korea tensions and the possibility of an all-out war are continuing to rise but recent bombing drills by South Korean and US troops suggest military options are being considered to end the crisis.After North Korea’s UN envoy said the country would never bow down to international pressure and give up its nuclear weapons program, diplomatic means of addressing the hostilities appear to have been sidelined in favour of military action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X