వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Must Read:Alaska:రెండు నెలలు ఆ పట్టణం చీకట్లోనే... 60 రోజుల తర్వాతే సూర్యోదయం..!

|
Google Oneindia TeluguNews

సూర్యుడు చంద్రుడు మన జీవితంలో ఒక భాగమైపోయాయి. సూర్య కాంతి లేకుండా ఉండలేము.. అదే సమయంలో చంద్రుడు వెదజల్లే వెన్నెల చూడకుండా ఉండలేము. ఇవన్నీ మనం చూస్తున్నామంటే అది మన అదృష్టమనే భావించాలి. కానీ అమెరికాలోని అలస్కా రాష్ట్రంలోని ఓ నగర ప్రజలు మాత్రం మనంత అదృష్టవంతులు కాదండోయ్. వారు ఏకంగా రెండు నెలల పాటు చిమ్మ చీకటిలోనే గడపాల్సి ఉంటుంది. ఇంతకీ ఆ నగరం ఏంటో తెలుసుకుందామా..!

 ఉత్‌కియాగ్విక్ పట్టణంలో రెండు నెలలు చీకటి

ఉత్‌కియాగ్విక్ పట్టణంలో రెండు నెలలు చీకటి

అలస్కా... అమెరికాలోని ఓ రాష్ట్రం. ఉత్తర అమెరికా ఖండానికి అత్యంత వాయువ్యంగా ఉన్న భూభాగం. అలాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటి. ఈ రాష్ట్రం భూభాగపరంగా అన్ని అమెరికా రాష్ట్రాలకన్నా పెద్దది. అలాస్కా భూభాగం రష్యా నుండి అక్టోబరు 18, 1867 న ఏడు మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయబడింది. ఈ రాష్ట్రంలో ఉన్న ఒక పట్టణం ఉత్‌కియాగ్విక్. ఈ పట్టణం ఆర్క్‌టిక్ సర్కిల్‌కు ఉత్తర భాగంలో ఉంటుంది. అంతకుముందు ఈ పట్టణాన్ని బారో అని పిలిచేవారు. ఈ పట్టణంలోని ప్రజలు రానున్న రెండు నెలలు చిమ్మచీకటిలో గడపనున్నారు. అంటే ఇక్కడ మరో రెండు నెలల పాటు సూర్య కాంతి కనిపించదు. ఈ ప్రక్రియనే పోలార్ నైట్ అని పిలుస్తారు. ఏటా శీతాకాలంలో ఇలాంటి పరిస్థితి ఉత్‌కియాగ్విక్ పట్టణంలో తలెత్తుతుంది.

 పోలార్ నైట్ అంటే ఏంటి..?

పోలార్ నైట్ అంటే ఏంటి..?

ఏటా చలికాలంలో అంటే నవంబర్ 18 లేదా 19వ తేదీన ఉత్‌కియాగ్విక్ పట్టణంలో సూర్యుడు అస్తమించి మరో 66 రోజుల పాటు కనిపించడు. తిరిగి జనవరి 22 లేదా 23వ తేదీన సూర్యుడు కనిపిస్తాడు. భూమి యొక్క అంశం వంపు కారణంగా ఏటా శీతాకాలంలో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సూర్యుడు కనిపించడు కనుక పగటి పూట పూర్తిగా చీకటిమయం అవుతుందా అంటే... దాదాపుగా చీకటిగానే ఉంటుందని అయితే కాస్త మందంగా వెలుతురు ఉంటుందని అల్లిసన్ చించార్ అనే మీటియరాలజిస్ట్ చెప్పారు. తిరిగి సూర్యుడు జనవరి 22న కనిపించినప్పుడు ఆ సమయంలో ఆకాశం ఎలా ఉంటుందనే దానిపైనే అందరి దృష్టి ఉంటుందని చించార్ చెప్పారు.

 భూమిపై అత్యంత మేఘావృతమైన ప్రాంతం

భూమిపై అత్యంత మేఘావృతమైన ప్రాంతం

ఇక ఉష్ణోగ్రతలు అత్యంత తక్కువగా ఉండటంతో పాటు ధృవ రాత్రి ప్రభావం కూడా ఉండటంతో భూమిపైన అత్యంత మేఘావృతమైన ప్రాంతంగా ఉత్‌కియాగ్విక్ గుర్తింపు పొందింది. ఆర్కిటిక్ మహాసముద్రం నుంచి గాలులు వీస్తున్నందున ఉత్‌కియాగ్విక్‌లో సంవత్సరంలో 50శాతం కంటే కాస్త ఎక్కువగా మేఘావృతమై ఉంటుంది. ఇక ఇక్కడ క్యుమిలీ మేఘాలు ఏర్పడటం చాలా అరుదుగా జరుగుతుంది. ఇక మంచు క్రమంగా తగ్గుతున్న సమయంలో అంటే ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలో మేఘాలు ఎక్కువగా కనిపిస్తాయి.ఇక ఉష్ణోగ్రతలు మైనస్ 34 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతే మంచుగడ్డలు ఏర్పడటం అక్కడ సర్వసాధారణం.

English summary
Utqiagvik a small town in Alaska goes into darkness for two months starting from November 19th in winter season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X