వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాఫ్రికా కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ పై వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు: యూకే శాస్త్రవేత్తల ఆందోళన

|
Google Oneindia TeluguNews

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ వచ్చినప్పటికీ ఆందోళన మాత్రం తగ్గటం లేదు. అందుకు కారణం కరోనా వైరస్ కొత్త వేరియంట్లు. యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె) లోని శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ లు దక్షిణాఫ్రికాలో ఇటీవల కనుగొనబడిన కరోనావైరస్ యొక్క కొత్త వేరియంట్‌పై పనిచేయవు అని ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం దీనిపై అధ్యయనం కొనసాగుతుంది.

Recommended Video

COVID-19 Vaccine Dry Run in India దేశవ్యాప్తంగా డమ్మీ వ్యాక్సిన్ డ్రైరన్ -వచ్చే వారం అసలైన టీకాలు..!
బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ పై ఆందోళన

బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ పై ఆందోళన

కరోనావైరస్ కొత్త స్ట్రెయిన్ నేపథ్యంలో బ్రిటన్ మరియు దక్షిణాఫ్రికా విపరీతంగా కరోనా కేసులు నివేదించాయి. ఈ కొత్త వేరియంట్లు కేసుల పెరుగుదలకు కారణమయ్యాయి. దేశంలో కొత్త కరోనావైరస్ వేరియంట్‌ను నివారించడంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉంటుందని యుకె అధికారులు చెప్పగా, బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ సోమవారం మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో ప్రబలుతున్న కరోనా స్ట్రెయిన్ గురించి ఇప్పుడు చాలా ఆందోళన చెందుతున్నామని చెప్పారు.

కొనసాగుతున్న పరిశోధనలు .. వ్యాక్సిన్ లలో ఆరువారాల్లో అవసరమైన మార్పులు

కొనసాగుతున్న పరిశోధనలు .. వ్యాక్సిన్ లలో ఆరువారాల్లో అవసరమైన మార్పులు

డిసెంబర్ 18 న, దక్షిణాఫ్రికా దేశంలోని మూడు ప్రావిన్సులలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ మహమ్మారి యొక్క కొత్త వేరియంట్‌ను కనుగొన్నట్లు ప్రకటించింది. దక్షిణాఫ్రికా ఈ వేరియంట్‌కు 501Y.V2 అని పేరు పెట్టింది. దక్షిణాఫ్రికాలో నివేదించబడిన ఈ వేరియంట్ మరో నాలుగు దేశాల నుండి ఇప్పటి వరకు నివేదించబడింది.

బయోఎంటెక్ సీఈఓ ఉగుర్ సాహిన్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ జాన్ బెల్ సహా శాస్త్రవేత్తలు కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్లను పరీక్షిస్తున్నారని, ఆరు వారాల్లో అవసరమైన మార్పులు చేర్పులు చేయవచ్చని చెప్పారు.

వ్యాక్సిన్ పని చేయదేమో అనేది కేవలం అనుమానమే : పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్

వ్యాక్సిన్ పని చేయదేమో అనేది కేవలం అనుమానమే : పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్

ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారులలో ఒకరి అభిప్రాయం ప్రకారం, దక్షిణాఫ్రికా కరోనావైరస్ వేరియంట్ గురించి మాట్ హాంకాక్ యొక్క ఆందోళనకు కారణం, యూకే యొక్క వేరియంట్ కోసం వస్తున్న వ్యాక్సిన్లు , దక్షిణాఫ్రికా వైరస్ కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటాయనే నమ్మకం వారికి లేదని ఉంది. కొత్త దక్షిణాఫ్రికా స్ట్రెయిన్ కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉండవని సూచించడానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ తెలిపింది.

డేంజర్ బెల్ మోగించిన కొత్త కరోనా వైరస్ ల వ్యాప్తి

డేంజర్ బెల్ మోగించిన కొత్త కరోనా వైరస్ ల వ్యాప్తి

ప్రపంచంలోని ధనిక దేశాలు 1.8 మిలియన్ల మందిని పొట్టనపెట్టుకున్న, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన కరోనా వైరస్ నుండి రక్షణ కోసం తమ జనాభాకు టీకాలు వేయడం ప్రారంభించాయి. ట్రయల్స్‌లో ప్రస్తుతం 60 వ్యాక్సిన్ లు ఉన్నాయి, వీటిలోఇప్పటికే ఆస్ట్రాజెనెకా మరియు ఆక్స్‌ఫర్డ్, ఫైజర్ మరియు బయోఎంటెక్, మోడరనా, రష్యాకు చెందిన స్పుత్నిక్ వి మరియు చైనా యొక్క సినోఫార్మ్ ఉన్నాయి.కొత్త వేరియంట్ల వ్యాప్తి ప్రస్తుతం మరోమారు డేంజర్ బెల్ మోగించింది.

కొనసాగుతున్న అధ్యయనం .. నెలరోజుల్లో రిజల్ట్

కొనసాగుతున్న అధ్యయనం .. నెలరోజుల్లో రిజల్ట్

శాస్త్రవేత్తల ప్రకారం, కొత్త దక్షిణాఫ్రికా వేరియంట్ చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని, దీనివల్ల రోగులకు కలిగే అనారోగ్య సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. ప్రభుత్వ వ్యాక్సిన్ టాస్క్‌ఫోర్స్‌కు సలహా ఇచ్చే ఆక్స్‌ఫర్డ్ బెల్, వ్యాక్సిన్ లు దక్షిణాఫ్రికా వేరియంట్‌పై పనిచేస్తాయా అనే దానిపై ప్రస్తుతం అధ్యయనం సాగుతుందని అన్నారు. దక్షిణాఫ్రికా జాతికి కొత్త వ్యాక్సిన్ పొందడానికి ఇప్పుడు ఒక నెల లేదా ఆరు వారాలు పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.

English summary
The scientists in United Kingdom are worried that the vaccines will work not on a new variant of the coronavirus found in South Africa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X