• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్నేహితుడిని చంపి అతని రక్తం తాగిన పిశాచి ఇతను..ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా..?

|

రష్యాలో దారుణం చోటు చేసుకుంది. నకిలీ సర్టిఫికేట్లు చూపించి డాక్టరుగా ఓ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. కొంతకాలానికి నకిలీ సర్టిఫికేట్లు బయటపడటంతో ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించింది హాస్పిటల్ సిబ్బంది. విచారణ సందర్భంగా నిందితుడికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

రష్యాలోని ఉరల్స్ సిటీ ఆఫ్ చెల్యాబిన్స్క్‌లోని ఓ హాస్పిటల్‌లో బోరిస్ కొండ్రాషిన్ అనే 36 ఏళ్ల వ్యక్తి గతేడాది నవంబరులో డాక్టరుగా చేరాడు. అయితే నకిలీ సర్టిఫికేట్లు చూపించి తను ఉద్యోగం పొందాడు. పేషెంట్లు మద్యం సేవించకుండా, పొగతాగకుండా ఎళా ఉండాలో కౌన్సిలింగ్ ఇచ్చే బాధ్యతను బోరిస్‌కు అప్పజెప్పింది హాస్పిటల్ యాజమాన్యం. అయితే తనకు ఇందులో అనుభవం ఉందని చెప్పాడు .అయితే ఆ సర్టిఫికేట్లు పోగొట్టుకున్నట్లు వెల్లడించాడని హాస్పిటల్ అధికారులు తెలిపారు. కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు మాత్రమే చూపించి ఉద్యోగం పొందినట్లు పేర్కొన్నారు. అనుకోకుండా ఆ హాస్పిటల్‌కు ఓ డాక్టరు వచ్చాడు. బోరిస్‌ను చూసి షాక్ అయ్యాడు. వెంటనే హాస్పిటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. అలర్ట్ అయిన అధికారులు బోరిస్ డిగ్రీ సర్టిఫికేట్లు జాగ్రత్తగా పరిశీలించిన పిమ్మట బోరిస్‌పై వేటు వేసి పోలీసులకు అప్పజెప్పింది.

Vampire killer’ who cut up friend’s body, drank blood found faking as doctor

ఇక్కడే అసలు కథ మొదలైంది. బోరిస్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో కొన్ని షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. బోరిస్‌ను కనుగొన్న డాక్టర్ ఒకప్పుడు బోరిస్‌కు సైకియాట్రిక్ ట్రీట్‌మెంట్ ఇచ్చాడట. ఎందుకిచ్చాడో తెలుసా... టీనేజర్‌గా బోరిస్ క్షుద్రపూజల పేరుతో తన క్లాస్‌మేట్‌ అయిన ఓ అబ్బాయిని చంపి అతని రక్తం తాగాడు. అప్పుడు అతని వయస్సు 16 ఏళ్లు. ఇది 1998లో జరిగింది. తనను తాను పిశాచిలాగా భావించాడు. ఆగష్టు 2000వ సంవత్సరంలో బోరిస్‌కు పరీక్షలు నిర్వహించగా ఆయన హోమిసైడల్ స్కీజోఫ్రినియాతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అంటే తను ఏమి చేస్తున్నాడు తనకు తెలియకుండా చర్యలు జరిగిపోతుంటాయని డాక్టర్లు వెల్లడించి అతన్ని చికిత్సకు పంపారు.

ఇదిలా ఉంటే బోరిస్ తల్లికి గాని తన సోదరికి గాని అతనికి ఉద్యోగం వచ్చిందన్న సంగతి తెలియదు. బోరిస్ కేవలం హైస్కూలు వరకు మాత్రమే చదివాడని వారు స్పష్టం చేశారు. అయితే సామాన్య ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టకపోవడంతో ఆయన్ను విడుదల చేయడం జరిగింది. అయితే మెడికల్ ట్రీట్‌మెంట్ కింద ఇంకా ఉండాలని కోర్టు తీర్పు వెలువరించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Russian man was charged Friday with faking documents to work as a hospital doctor after reportedly spending a decade in a psychiatric facility for killing a high school classmate and drinking his blood.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more