వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏమవుతుంది?: సెప్టెంబర్ 4న థెరిసాకు సెయింట్ హోదా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: తన జీవితాంతం బడుగు జీవుల సేవలో తరించిన భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత మదర్ థెరిస్సాకు అరుదైన గౌరవం లభించింది. మదర్ థెరీసాకు వాటికన్ సెయింట్ హుడ్‌ను ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 2.30 నిమిషాలకు పోప్ ఫ్రాన్సిస్ కాననైజేషన్ (మహిమాన్విత హోదాను ప్రకటిస్తూ తయారుచేసిన ఉత్తర్వుల పత్రం)పై సంతకం చేశారు.

కాగా, మరణించిన 18 ఏళ్ల తర్వాత మదర్ థెరిస్సాకు ఈ హోదా లభించింది. అధికారికంగా ఈ హోదాను ఈ ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన ఇవ్వనున్నారు. భారత్‌లో జరిగే కాననైజేషన్ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించాలని మిషనరీస్ ఆఫ్ చారిటీతో పాటు ఇండియన్ క్యాథలిక్కుల సంఘం నిర్ణయించింది.

Vatican To Approve Sainthood For Mother Teresa

ఈ కార్యక్రమానికి పోప్ ఫ్రాన్సిస్ సైతం హాజరవుతారని అంచనా. ఈ సెయింట్ హుడ్ ప్రకటించడం ద్వారా మదర్‌ థెరిస్సాను కేవలం ఓ సేవా మూర్తిగానే కాకుండా దైవశక్తులు ఉన్న ఓ దేవదూతగా చూస్తారు. 2008లో బ్రెజిల్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాంతక మెదడు వ్యాధితో బాధపడుతున్న సమయంలో మదర్ థెరిస్సా తన అద్బుతమైన శక్తులతో దీవించి అతని ప్రాణాలు కాపాడారట.

ఇందులో భాగంగానే మదర్‌ థెరిస్సాకు వాటికన్ సిటీ అధికారికంగా దైవత్వాన్ని అందించింది. మాసిడోనియాలో 1910లో జన్మించిన మదర్ థెరిసా కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించి 45 ఏళ్లపాటు పేదలు, రోగులకు విశిష్టమైన సేవలందించారు. 1950లో భారత పౌరసత్వం స్వీకరించారు.

1979లో నోబెల్ శాంతి బహుమతి పొందారు. 1997లో కోల్‌కతాలో ఆమె తుది శ్వాస విడిచారు. కాగా మదర్ థెరిసా రోమన్ క్యాథలిక్ కేంద్రమైన వాటికన్ నుంచి 'మిషనరీస్ ఆఫ్ ఛారిటీ' స్థాపనకు అనుమతి పొందారు. రోమన్ క్యాథలిక్ వ్యవస్థకు అనుబంధంగా ఉంటూ, స్వతంత్ర ప్రతిపత్తి గల 'మిషనరీస్ ఆఫ్ చారిటీ' ద్వారా ప్రపంచ వ్యాప్తంగా సేవలందించారు.

English summary
Mother Teresa will be cleared to become a saint today after a Vatican panel recognises a second miracle attributed to the nun famed for her work with the poor of Kolkata.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X