వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోపిడీలు, దొంగతనాలు: నోట్ల రద్దుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం!

వెనిజులాలో నోట్ల రద్దు ఆందోళనలకు, లూటీలకు దారి తీసింది. పెద్ద నోట్ల రద్దు పైన తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది.

|
Google Oneindia TeluguNews

వెనిజులా: వెనిజులాలో నోట్ల రద్దు ఆందోళనలకు, లూటీలకు దారి తీసింది. పెద్ద నోట్ల రద్దు పైన తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. ప్రజల ఆందోళనలు, నిరసనల సెగ తగలడంతో రద్దును ప్రస్తుతానికి పక్కకు పెట్టింది.

జనవరి 2వ తేదీ నుంచి పెద్దనోటు రద్దు అమలులోకి వస్తుందని, అప్పటి దాకా వాటిని ఉపయోగించుకోవచ్చునని వెనిజులా ప్రభుత్వం ప్రకటించింది. భారతలో రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసినట్లుగానే వెనెజువెలా ప్రభుత్వం అక్కడ అతి పెద్ద నోటు 100 బొలివర్స్‌ను రద్దు చేస్తున్నట్లు ఈ నెల 11న ప్రకటించింది.

venezuela

ఇది 72 గంటల్లో అమల్లోకి వస్తుందని తెలిపింది. అంతేకాదు, ప్రజల వద్ద ఉన్న 100 బొలివర్స్‌ను మార్చుకునేందుకు కేవలం పది రోజులు గడువిచ్చింది. చాలామంది కొన్ని వందల కి.మీ. ప్రయాణించి నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు చేరుకున్నారు.

మరోవైపు 100 స్థానంలో 20వేల బొలివర్స్‌ నోటును అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆ నోటు రాలేదు. వెనిజులాలో అత్యధికస్థాయి ద్రవ్యోల్బణం నేపథ్యంలో చిన్న సరుకులకు కూడా పెద్దపెద్ద నోట్ల కట్టలు తీయాల్సిందే. అతిపెద్ద నోటును రద్దు చేయడం, తెస్తామన్న 20వేల బొలివర్స్‌ కరెన్సీ అందుబాటులోకి రాకపోవడంతో జనం కష్టాలు తారస్థాయికి చేరాయి.

ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు దోపిడీలు, లూటీలు పెరిగాయి. దుకాణాల పైన దాడులు మొదలయ్యాయి. ఎవరికి దొరికింది వారు ఎత్తుకెళ్లారు. అప్పటికే నేరాలతో సతమతమవుతున్న వెనిజులాలో నోట్ల రద్దుతో మరిన్ని నేరాలు పెరిగాయి. దీంతో రద్దును తాత్కాలికంగా జనవరి 2వ తేదీ వరకు వాయిదా వేసింది.

English summary
Venezuela to delay demonetisation after protests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X