వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకలి కేకలు: తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వెనిజుల, ఐదు ‘0’లు తొలగిస్తేనే!

|
Google Oneindia TeluguNews

కరాకస్: దక్షిణ అమెరికా తీరంలోని వెనిజులా దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. పెట్రోల్‌ ఉత్పత్తులు ధరలు క్రాష్‌ కావడంతో మొదలైన సంక్షోభం.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ వచ్చాక మరింత ఎక్కువైంది.

సామాన్యుడికి అందుబాటులో లేని ధరలతో... జనాలకు సరిగా తిండి లేకుండా పోయింది. ఒక్క బ్రెడ్ కోసం గంటల తరబడి క్యూలైన్లు కడుతున్నారు. దీంతో దేశంలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం వెనిజులా ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Venezuela to remove five zeroes from ailing currency

ఆ దేశ ద్రవ్యోల్బణ రేటు కూడా పది శాతం, వంద శాతం, రెండొందల శాతం కాకుండా... ఏకంగా 10 లక్షల శాతం మేర పెరిగిపోతుందట. 2018లో వెనిజులా ద్రవ్యోల్బణం 10 లక్షల శాతాన్ని తాకే అవకాశముందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెల్లడించింది. ఈ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవాలంటే కరెన్సీలో ఐదు సున్నాలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు వెనిజుల సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ అధునాతన చరిత్రలో అత్యంత హీనాతిహీనమైన ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశం వెనిజులానే అని ఐఎంఎఫ్ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. 2014లో ఆయిల్‌ ధరలు క్రాష్‌ అవడంతో మొదలైన పతనం, అలా కొనసాగుతూనే ఉందని, వెనిజులానే కుప్పకూలేలా చేసిందని పేర్కొంది. ధరల పెంపుదలను, సౌమ్యవాద వ్యవస్థనువెనిజులా నియంత్రించలేకపోతుందని చెప్పింది.

English summary
Venezuela will remove five zeroes from the bolivar currency rather than the three zeroes originally planned, President Nicolas Maduro said on Wednesday, in an effort to keep up with inflation projected to reach 1 million percent this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X