నాటి నుంచి నేటి వరకు ఏం జరిగింది: మరికాసేపట్లో కుల్‌భూషణ్ జాధవ్ కేసులో ఐసీజే తీర్పు
నెదర్లాండ్స్ : పాకిస్తాన్ జైలులో మగ్గుతున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు సంబంధిచిన తీర్పు మరికొద్ది గంటల్లో రాబోతుంది. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తాన్ సైన్యం కుల్‌భూషణ్ జాధవ్‌ను మార్చి 3, 2016లో అరెస్టు చేసింది. ఆ పై మరణశిక్ష విధించింది. ఈ క్రమంలోనే భారత్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. అయితే తీర్పు వెలువరించేవరకు కుల్‌భూషణ్ జాధవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోరాదని పాక్‌కు ఆదేశించింది. కుల్‌భూషణ్ జాధవ్ అరెస్టు తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి ఏ రోజు ఏం జరిగిందనేదానిని ఒక్కసారి పరిశీలిద్దాం.
కుల్‌భూషణ్ జాధవ్ కేసు అంతర్జాతీయ కోర్టుకు చేరకముందు ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి. మార్చి 2, 2016లో ఇరాన్ మీదుగా పాకిస్తాన్లోకి ప్రవేశించాడనే ఆరోపణలపై కుల్‌భూషణ్‌ను అరెస్టు చేసి ఆ తర్వాత భారత్ జోక్యం చేసుకుని విడిచిపెట్టాల్సిందిగా కోరడం, ఆరోపణలు ప్రత్యారోపణలు ఇలా చాలా జరిగాయి. చివరకు భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంను ఆశ్రయించింది. కుల్‌భూషణ్ జాధవ్ పై ఉగ్రవాది ముద్ర పాక్ వేసింది. పాకిస్తాన్ మిలటరీ ట్రైబ్యునల్ విధించిన మరణశిక్ష తీర్పును సవాల్ చేస్తూ ప్రపంచ న్యాయస్థానంకు భారత్ వెళ్లింది. దీంతో అంతర్జాతీయ న్యాయస్థానం స్టే విధించింది. దాదాపు మూడేళ్ల పాటు సాగిన ఈకేసులో తీర్పును జూలై 17న అంతర్జాతీయ న్యాయస్థానం వెలువరించనుంది.

మార్చి 3, 2016
హుస్సేన్ ముబారక్ పటేల్ అనే మారు పేరుతో రీసెర్స్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏజెంట్‌గా పనిచేస్తున్న కుల్‌భూషణ్ జాధవ్‌ను బలోచిస్తాన్లో బంధీగా పట్టుకుంది పాక్ సైన్యం
మార్చి 25, 2016
తాను ఇండియన్ నేవీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడని కుల్‌భూషణ్ జాధవ్ చెప్పిన స్టేట్మెంట్ను పాక్ విడుదల చేసింది.అయితే కుల్‌భూషణ్ జాధవ్ మాజీ నేవీ అధికారి అని భారత్ ప్రకటించింది. అతను గూఢచారి కాదని తనను భారత కాన్సులేట్‌లో అప్పగించాలని మన ప్రభుత్వం కోరింది.
ఏప్రిల్ 8, 2016
జాధవ్‌పై క్వెట్టాలో తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పాకిస్తాన్ అధికారులు
మే 2, 2016
కుల్ భూషణ్ జాధవ్ పై ప్రాథమిక విచారణ చేపట్టిన పాక్ అధికారులు
జూన్ 16, 2016
ఇరాన్ మీదుగా పాకిస్తాన్లోకి ప్రవేశించాలని జాధవ్ భావించాడని ఆరోపిస్తూ పాక్ ఇరాన్ దేశ అధికారులను సంప్రదించగా జూన్ 16న ఇరాన్ అధికారులు స్పందించారు. అయితే ఆ విషయాలను పాక్ అధికారులు మీడియాకు చెప్పలేదు
జనవరి 2017
భారత్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరలేపుతోందంటూ ఐక్యరాజ్యసమితిలో పాక్ దౌత్యవేత్త మలీహా లోధి యూఎన్ చీఫ్ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాదు జాధవ్ అరెస్టు గురించి కూడా ప్రసావించారు
ఏప్రిల్ 10, 2017
గూఢచర్యంకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పాకిస్తాన్ మిలటరీ ట్రైబ్యునల్ కోర్టు కుల్దీప్ జాధవ్‌కు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఏప్రిల్15, 2017
మిలటరీ కోర్టు ఇచ్చిన తీర్పుపై జాధవ్ తరపున ఎవరూ వాదించరాదని లాహోర్ హై కోర్టు బార్ అసోసియేషన్ తమ న్యాయవాదులకు అల్టిమేటం జారీ చేసింది. పాకిస్తాన్‌లోని అమాయకులైన ప్రజల ప్రాణాలతో ఆడుకునేందుకు వచ్చిన జాధవ్ విడుదల కాకుండా చూస్తామని బార్ అసోసియేషన్ సెక్రటరీ ఆమిర్ సయీద్ రాన్ తెలిపాడు
మే 8, 2017
వియన్నా కన్వెన్షన్ నిబంధనలను జాధవ్ కేసులో పాక్ ఉల్లంఘిస్తోందంటూ భారత్ అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది.
మే 18, 2017
జాధవ్‌ను ఉరితీయడంపై పాకిస్తాన్‌కు స్టే ఇస్తూ అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యం చేసుకోరాదని వాదించిన పాకిస్తాన్‌కు కోర్టు మొట్టికాయ వేసింది.
జూన్ 22, 2017
జాధవ్ చెప్పినట్లుగా పాకిస్తాన్ మరో స్టేట్మెంట్ను విడుదల చేసింది. పాక్‌లో నిషేధిత బలోచ్ లిబరేషన్ ఆర్మీలో తాను పనిచేస్తున్నట్లు కుల్‌భూషణ్ ఒప్పుకున్నాడని పేర్కొంది. అంతేకాదు తనపై దయతలచి ఉరిశిక్షను రద్దు చేయాలని వేడుకున్నాడంటూ పాక్ తెలిపింది.
సెప్టెంబర్ 2017
పాకిస్తాన్ వియన్నా కన్వెన్షన్‌ను ఉల్లంఘిస్తోందని కనీసం భారత దౌత్యకార్యాలయంకు కూడా జాధవ్‌ను పంపడం లేదంటూ లిఖితపూర్వకమైన ఫిర్యాదును అంతర్జాతీయ కోర్టులో భారత్ ఇచ్చింది.
నవంబర్ 10, 2017
కుల్‌భూషణ్ జాధవ్ తన భార్యను కలిసేందుకు పాక్ ఏర్పాటు చేసింది. ఇది మానవతా కోణంలోనే చేసింది
డిసెంబర్ 13, 2017
భారత్ ఐసీజేలో దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్ పిటిషన్‌ను పాకిస్తాన్ దాఖలు చేసింది. వియన్నా కన్వెన్షన్ నిబంధనలు గూఢచర్యంకు వర్తించవంటూ కోర్టుకు తెలిపింది.
డిసెంబర్ 25, 2017
జాధవ్‌ను కలిసేందుకు తన తల్లి, భార్యను పాక్ అనుమతించింది. జాధవ్ తల్లిని, భార్యను భద్రత పేరుతో తనిఖీలు చేయడం వారిని ఒకే భాషలో మాట్లాడాలని పాక్ ఆదేశించడంతో ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి.
జనవరి 6, 2018
క్వింట్ అనే వార్తా సంస్థ ఓ సంచలన కథనంను ప్రచురించింది. జాధవ్ రా ఏజెంట్‌గా నియమితుడయ్యాడని పాకిస్తాన్లో పలు ఆపరేషన్స్ నిర్వహించేందుకు రా పంపిందంటూ కథనం ప్రచురించింది. కథనం ప్రచురించిన కొద్ది గంటలకే తమ వెబ్సైట్ నుంచి తొలగించింది.
ఫిబ్రవరి 2, 2018
ఫ్రంట్‌లైన్ అనే ప్రముఖ పత్రిక మరో కథనం ప్రచురించింది. జాధవ్ భారత నేవీ ఆఫీసర్‌గా పని చేస్తున్నారని పాకిస్తాన్‌పై భారత్ రహస్య యుద్ధంను ప్రకటించిన నేపథ్యంలో అతన్ని వినియోగించుకోవాలని భావించి ఉండొచ్చనే కథనం ప్రచురించింది.
ఫిబ్రవరి 6, 2018
ఉగ్రవాద చర్యలకు గూఢచర్యం ఆరోపణలపై ప్రస్తుతం జాధవ్ శిక్ష అనుభవిస్తున్నట్లు పాక్ అధికారి ఒకరు తెలిపారు. అదే సమయంలో జాధవ్‌కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని పాకిస్తాన్ 13 మంది భారత అధికారులను కోరగా భారత్ వైపు నుంచి ఎలాంటి సహకారం అందలేదని తెలిపారు.
ఫిబ్రవరి 19, 2019
పుల్వామా దాడులు జరిగిన తర్వాత పాక్ భారత్‌ల మధ్య అంతర్జాతీయ కోర్టు వేదికగా తొలిసారి వాదనలు జరిగాయి. ఇది నాలుగురోజుల పాటు జరిగాయి.జాధవ్‌కు విధించిన మరణశిక్షను రద్దు చేయాల్సిందిగా భారత ప్రభుత్వం కోరింది.
జూలై 4 , 2019
ఇక పూర్తి వాదనలు ముగియడంతో జూలై 17న తమ తీర్పును వెలువరిస్తామని అంతర్జాతీయ న్యాయస్థానం మీడియా ప్రకటన ద్వారా తెలిపింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!