వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్... ఇంట్రెస్టింగ్: సింగపూర్‌కు కిమ్ ఎలా వచ్చాడో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు సింగపూర్ ఎలా వచ్చారో తెలుసా...? ఎలా వస్తారు..? విమానంలో వచ్చి ఉంటారు అనే సమాధానం రెడీగా ఉంటుంది. విమానంలోనే కిమ్ వచ్చారు... అయితే ఆ విమానం ఎవరు సప్లై చేశారనేదే చాలా ఆసక్తికరంగా మారింది. కిమ్ ఉత్తరకొరియా నుంచి సింగపూర్ వచ్చేందుకు చైనా అతిపెద్ద బోయింగ్ విమానంను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ భేటీ

దీంతో ఉత్తరకొరియా చైనా దేశాల మధ్య బంధం ఎలాంటిదో మరోసారి ప్రపంచానికి రుజువైంది. ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండానే కిమ్‌కు ఉచితంగా ఈ బోయింగ్ విమానం అందజేసినట్లు చైనా ఉన్నతాధికారులు తెలిపారు.

Very interesting: How did Kim get to Singapore?

ఇదిలా ఉంటే... కిమ్ జాంగ్ ఉన్ ఉత్తరకొరియా అధ్యక్షుడిగా 2011 లో బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇంత సుదూర ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి సింగపూర్ 3వేల మైళ్ల దూరంలో ఉంది. ఇక కిమ్ ప్రయాణించిన ఎయిర్ చైనా బోయింగ్ 747 విమానం అమెరికాలోనే తయారైంది.

ఈ విమానంలో చైనాకు చెందిన మాజీ అధ్యక్షులు ప్రయాణించారు. సింగపూర్‌కు విమానం చేరుకోగానే కిమ్ బయటకు అడుగుపెడుతున్న సమయంలో కెమెరాలన్నీ ఒక్కసారిగా క్లిక్ మన్నాయి. కిమ్ ప్రయాణించిన బోయింగ్ విమానంతో పాటు మరో రెండు పెద్ద విమానాలు సింగపూర్‌ విమానాశ్రయంలో కొలువు దీరాయి.

Very interesting: How did Kim get to Singapore?

ఈ రెండు విమానాలు ఉత్తరకొరియాకు చెందిన ఎయిర్ కొరియో సంస్థ ఆపరేట్ చేస్తోంది. ఒక విమానంలో కిమ్ సోదరి ఆయన సలహాదారుడు కిమ్ యో జాంగ్‌లు ప్రయాణించగా మరో విమానంలో కిమ్ సామగ్రి వచ్చింది.

English summary
When North Korean leader Kim Jong Un hitched a ride on an Air China plane to his summit with Donald Trump in Singapore, the signal was clear: Beijing remains Pyongyang's diplomatic wingman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X