వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్‌ విమానంను ఢీకొట్టింది ఇరాన్ క్షిపణేనా... వీడియోలో కనిపిస్తుందేంటి..?

|
Google Oneindia TeluguNews

ఇరాన్‌ అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం సులేమనీపై అమెరికా వైమానిక దాడులు చేసి మట్టుబెట్టిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా తయారయ్యాయి. ఇక రెండురోజుల క్రితం ఇరాన్‌లో ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన ప్రమాదంలో 176 మంది మృతి చెందారు. సాంకేతిక లోపంతోనే విమానం కూలిందని ముందుగా ప్రకటనలు వచ్చాయి.

అయితే ఇరాన్‌కు చెందిన క్షిపణి ఆ విమానంను కూల్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదే కోణంలో కూడా విచారణ జరపాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా తన అధికారులను ఆదేశించారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రత్యక్షమైంది. ఇందులో విమానంను ఓ క్షిపణి ఢీకొన్న దృశ్యాలు ఇందులో ఉన్నాయి.

అసలు ప్రమాదానికి గల కారణం ఏంటో అధికారులు విచారణ చేస్తున్న క్రమంలోనే ఈ వీడియ వెలుగులోకి వచ్చింది. దీంతో విచారణ మరో కోణంలో జరుగుతోంది. మరోవైపు అమెరికా దాని మిత్ర దేశాలు కూడా క్షిపణి ఢీకొట్టడంతోనే విమానం కూలిందని భావిస్తున్నాయి. దీనికి ఈ వీడియో మరింత బలాన్ని చేకూర్చుతోంది. అయితే ఇరాక్‌లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ప్రమాదవశాత్తు ఈ విమానంను డీకొట్టి ఉంటుందని తెలుస్తోంది.

ఇక వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే విమానం గాల్లో ఉండగానే విమానంకు మంటలు అంటుకున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. అయితే విమానం మాత్రం పేలిపోలేదు. ఇది వీడియోలో కనిపిస్తోంది. మంటలు ఉండగానే కొన్ని నిమిషాల పాటు విమానం గాల్లోనే ఎగిరిన విమానం ఆ తర్వాత తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకునే క్రమంలో పేలిపోయి క్రాష్ కావడం కనిపించింది.

Video goes viral where Ukrainian plane being hit over Iran

Recommended Video

180 మందీ దుర్మరణం: ఉక్రెయిన్ విమాన ప్రమాద వీడియో..!

ఇక వీడియోలో ఉన్న పారామీటర్లు అధికారిక ఫ్లయిట్ పాత్ పారామీటర్లతో సరిపోలాయి. విమాద ప్రమాద సమయంలో శాటిలైట్ ఇమేజెస్‌ను మక్సర్ టెక్నాలజీస్ అనే స్పేస్ టెక్నాలజీ కంపెనీ సేకరించింది. ఇక విమానంలో నుంచి మంటలు రావడం క్షిపణి ఢీకొట్టడంతోనే జరిగిందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. కెమెరా ఉన్న చోట నుంచి రెండు మైళ్ల దూరంలో విమాన ప్రమాదం జరిగినట్లుగా పేలుడు శబ్దం నిర్ధారిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇక దూరాన్ని కూడా ఫ్లయిట్ రేడార్ 24 నిర్థారిస్తోంది.

English summary
Video verified by The New York Times appears to show an Iranian missile hitting a plane near Tehran’s airport, the area where a Ukrainian jet crashed on Wednesday, killing all 176 people on board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X