వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ వైపు గాలులు, మరోవైపు మంచు: ఈ పైలట్ విమానాన్ని ఎలా దింపాడో చూడండి (వీడియో)

|
Google Oneindia TeluguNews

లండన్: బ్రిస్టల్ విమానాశ్రయంలో ఓ పైలట్ అత్యంత చాకచక్యంగా విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. అతనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన ఇటీవలే శుక్రవారం జరిగింది. కల్లమ్ తుఫాను కారణంగా భారీ గాలులు వీస్తున్న సమయంలో విమానం ఓ వైపు పక్కకు ఒరిగి ప్రయాణించినప్పటికి అతను ఎంతో చాకచక్యంగా దానిని కిందకు దించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

<strong>ఈ అద్భుతాన్ని నమ్ముతారా?: వెనక్కి వెళ్లిన జలపాతం, కారణం ఇదే</strong>ఈ అద్భుతాన్ని నమ్ముతారా?: వెనక్కి వెళ్లిన జలపాతం, కారణం ఇదే

పెను గాలులకు తోడు మంచు కారణంగా విమానాన్ని కిందకు దించడానికి సానుకూల వాతావరణం లేని సమయంలో సదరు పైలట్ కనబర్చిన నైపుణ్యం అద్భుతం. సాధారణంగా విమానం నేరుగా వచ్చి రన్‌ వే పై దిగి కొంత దూరం ముందుకు వెళ్లి ఆగుతుంది.

అయితే, భారీ గాలులు, మంచు వల్ల విమానం నేరుగా వచ్చి రన్‌ వే పైన దిగే అవకాశం లేదు. దీంతో ఆ పైలట్‌ విమానాన్ని ముందు వైపునకు కాకుండా కుడి వైపునకు అడ్డంగా తీసుకెళ్లి దింపాడు.

Video: Pilots Daring Sideways Landing At Bristol Airport During Storm

అనంతరం రన్‌ వేపై ఎటువంటి ప్రమాదం జరగకుండా దానిని మళ్లీ చాకచక్యంగా ముందుకు తీసుకు వెళ్లాడు. ఆ పైలట్ టీయూఐ ఎయిర్‌వేస్‌కు చెందిన వ్యక్తి. దాదాపు నిమిషం పాటు ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

English summary
A pilot executed a daring sideways landing at Bristol Airport in UK during Storm Callum. Caught amidst powerful winds blowing directly across the runway, the pilot managed to land sideways safely, shows a dramatic video going viral on the Internet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X