• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండో బందీ శిరచ్ఛేదనం: ఐఎస్ఐఎస్ ఘాతుకం, ప్రధాని కంటతడి

|

టోక్యో: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ అదుపులో ఉన్న జపాన్‌కు చెందిన రెండో బందీని కూడా అత్యంత కిరాతకంగా తల నరికి చంపేశారు. ఇద్దరు జపాన్ పౌరులను బందీలుగా పట్టుకొని వారి విడుదలకు భారీగా డబ్బు డిమాండ్ చేసిన ఉగ్రవాదులు, కొద్దిరోజుల క్రితమే ఒక బందీని చంపేశారు. తాజాగా ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయిన కెంజీ గోటో(47)ను కూడా హత్యచేశారు. తల లేని గోటో మృతదేహం, దాని పక్కనే నిలబడి జపాన్ ప్రధాని సింజో అబేను హెచ్చరిస్తున్న ఉగ్రవాది వీడియో ఒకదానిని ఉగ్రవాదులు శనివారం అర్థరాత్రి ఇంటర్నెట్‌లో ఉంచారు.

అయితే వీడియోలో ఇంతకుముందే ఈ సంస్థ చంపేస్తామని ప్రకటించిన జోర్డాన్ పైలట్‌ను కూడా చంపేసారా లేదా అనే విషయం తెలపలేదు. గ్వాంటనామో బే జైల్లో ఖైదీలు ధరించే దుస్తులలాగే ఉండే ఆరంజ్ రంగు దుస్తులు ధరించిన గోటో మసుగు ధరించి నిలబడి ఉన్న వ్యక్తిపక్కన మోకాళ్లపై కూర్చుని ఉన్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.

Video shows Islamic State behead 2nd Japanese hostage

కాగా, గోటో వధకు జపాన్ ప్రభుత్వమే కారణమని ఇంగ్లీషువాళ్లు మాట్లాడే యాసలో మాట్లాడిన ఆ ముసుగు వ్యక్తి ఆరోపించడం గమనార్హం. అతను మాట్లాడిన తీరుచూస్తే గతంలో ఈ మిలిటెంట్ గ్రూపు బందీలను తలనరికే వీడియోలో కన్పించిన మిలిటెంట్, ఇతను ఒకడేననిపిస్తోంది. జపాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య నిర్ణయాలే హత్యకు కారణమని, జపాన్ పీడకలకు ఇది నాంది అని జపాన్ ప్రధాని షింజో అబేను హెచ్చరించాడు.

జపాన్‌లో ఈ వీడియో వార్త మీడియాలో వచ్చిన తర్వాత టెర్రరిస్టులను ఎప్పటికీ క్షమించేది లేదంటూ ప్రధాని అబే ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కంటతడి పెట్టారు. ‘ఈ కిరాతక, హేయమైన చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా. ఉగ్రవాదులను మేం వదిలిపెట్టబోము. వారు తమ నేరాలకు ప్రాయశ్చిత్తం చేసుకొనేవరకూ అంతర్జాతీయ సమాజానికి సహకరిస్తూనే ఉంటాం' అని స్పష్టం చేశారు.

కుమారుడి మరణంతో దుఃఖసాగరంలో మునిగిపోయిన గోటో తల్లి జుంకో ఇషిడో, తన కుమారుని మరణం గురించి మాట్లాడేందుకు మాటలు రావటంలేదంటూ భోరున విలపించారు. జపాన్ పౌరుడి హత్యను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఖండించారు.

English summary
He ventured to Syria to tell the stories of lives torn apart by war. But in doing so, Japanese journalist Kenji Goto suffered his own gruesome fate apparently becoming the latest foreigner to be decapitated by ISIS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more