వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: ధైర్యముంటేనే చూడండి.. ఆ వ్యక్తి ఊపిరి తిత్తులు ఎలా ఉన్నాయంటే..?

|
Google Oneindia TeluguNews

చైనా: పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రతి సిగరెట్టు పెట్టెపై రాసి ఉంటుంది. పొగతాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా శ్వాసవ్యవస్థ, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. అయితే ఇప్పటి వరకు పొగ తాగే వ్యక్తి ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో కేవలం వూహాజనిత ఫోటోలను మాత్రమే చూసిఉంటాం. కానీ పొగతాగే వ్యక్తుల ఊపిరితిత్తులు ఎలా తయారు అవుతాయో ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 చైనాలో అవయవదానం చేసిన వ్యక్తి

చైనాలో అవయవదానం చేసిన వ్యక్తి

చైనాలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే తన మరణం తర్వాత తన శరీర అవయవాలను దానం చేస్తున్నట్లు బతికుండగానే రాసిచ్చాడు. అయితే 52 ఏళ్ల వయస్సులో ఆ వ్యక్తి మృతి చెందాడు. ఇక తను చెప్పినట్లుగానే అవయవాలు సేకరించేందుకు వైద్యులు అతని శరీరంను కోశారు. ఒక్కో అవయవం శరీరం నుంచి వేరు చేస్తూ వచ్చారు. కిడ్నీలు, కళ్లు, మెదడు ఇలా. ఇక చివరిగా ఊపిరితిత్తుల దగ్గరకు వచ్చేసరికి షాక్ వైద్యులు షాక్ అయ్యారు.

మసిపూసినట్లుగా ఉన్న ఊపిరితిత్తులు

ఊపరితిత్తులను వైద్యులు శరీరం నుంచి వేరు చేశారు. వీటిని చూసి అవాక్కయ్యారు. అవి మసిపూసినట్లుగా నల్లగా తయారయ్యాయి. చనిపోయిన వ్యక్తికి పొగతాగే అలవాటుందని గ్రహించారు. అయితే గత 30 ఏళ్లుగా రోజుకో సిగరెట్ ప్యాకెట్ తాగే వాడని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇలా చైన్ స్మోకింగ్ చేయడం వల్లే ఊపిరితిత్తులు నల్లగా తయారయ్యాయని వైద్యులు చెప్పారు.

 ఊపిరితిత్తులను వీడియో తీసిన డాక్టర్లు

ఊపిరితిత్తులను వీడియో తీసిన డాక్టర్లు

ఇక శరీరం నుంచి ఒక్కో అవయవం తీస్తున్న సమయంలో ఊపిరితిత్తులు కూడా బయటకు తీస్తున్న వీడియోను రికార్డ్ చేశారు సర్జన్లు. ఆ వీడియో ఒక్కసారిగా చైనాకు చెందిన సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియోకు 25 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతే స్థాయిలో నెటిజెన్లు కూడా స్పందించారు. బెస్ట్ యాంటీ స్మోకింగ్ యాడ్ అని నెటిజెన్లు కామెంట్ చేశారు.

Recommended Video

టిబెట్ ప్రజలే నా వారసున్ని ఎన్నుకుంటారు దలైలామా | China Can Never Decide My Successor Says Dalailama
 ఇలాంటి ఊపిరి తిత్తులు మరొకరికి అమర్చలేం: వైద్యులు

ఇలాంటి ఊపిరి తిత్తులు మరొకరికి అమర్చలేం: వైద్యులు

ఇక వీడియో విషయానికొస్తే ... డాక్టర్ చెన్‌ జింగ్యూ అతని టీమ్ ఊపిరితిత్తులను పరీక్షిస్తున్నట్లుగా ఉంది. కొన్నేళ్లుగా పాగాకు ఉత్పత్తులు తీసుకోవడంతో ఆ ఊపిరితిత్తులు ఎలా నల్లగా మారాయనేది చెబుతున్నారు. చైనాలా చాలా మందికి ఇలాంటి ఊపిరితిత్తులే ఉంటాయని డాక్టర్ చెన్ అన్నారు. ఎందుకుంటే అక్కడ పొగతాగే వారి సంఖ్య చాలా అధికం అని చెప్పారు. అయితే ఈ ఊపిరితిత్తులు మరో వ్యక్తికి అమర్చలేమని చెప్పారు. ఒకవేళ పొగతాగే వ్యక్తి అయితే మరణం తర్వాత ఊపిరితిత్తులు దానం చేసినప్పటికీ వాటిని మరొకరికి అమర్చలేమని డాక్టర్ చెన్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన సమాచారం ప్రకారం పొగతాగడం వల్ల ఏడాదికి 8 మిలియన్ మంది చనిపోతున్నారని వెల్లడించింది.

English summary
A shocking video shows the tar-blackened lungs of a chain smoker who finished a packet of cigarettes a day for 30 years. Doctors in China were forced to reject the lungs that were extracted for organ transplant after the man died at the age of 52.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X