• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Video Viral:ఓ వైపు మహిళ ఏరోబిక్స్.. మరో వైపు సైనిక చర్య: ఏమీ పట్టనట్లుగా..!

|

మయన్మార్‌ దేశ పరిస్థితులు గంట గంటకు మారుతున్నాయి. దేశం సైనిక పాలనలోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అంగ్‌సాన్ సూకీని అరెస్టు చేశారు ఆదేశ సైనికాధికారులు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువతి రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఏరోబిక్స్ చేస్తున్న సమయంలో ఆమె వెనకాలే మిలటరీ వాహనాలు వెళుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. కానీ ఆ మహిళ తనకేమీ పట్టనట్లుగా ఆమె ఏరోబిక్స్ చేయడంలో లీనమైపోయింది.

మయన్మార్ పార్లమెంట్ ఎదురుగా ఈ యువతి ఏరోబిక్స్ చేస్తోంది. అదే సమయంలో సైనిక చర్యను అమలు చేసేందుకు పలు వాహనాల్లో మిలటరీ వర్గాలు పార్లమెంటు వైపు దూసుకెళుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. ఏరోబిక్స్ చేసే యువతిని ఖింగ్ హ్నిన్‌ఇన్ వాయ్‌గా గుర్తించారు. ఆమె వ్యాయామ టీచర్‌గా పనిచేస్తోంది. ఖింగ్ ఏరోబిక్స్ చేస్తున్న సమయంలో నల్లటి వాహనాలు పార్లమెంటు వైపు దూసుకెళ్లాయి.అయితే సైనిక చర్య జరుగుతోందన్న విషయం ఖింగ్‌కు తెలియదు. ఓ ఇండోనేషియన్ పాటకు స్టెప్పులేస్తూ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్‌లో ఈ నల్లటి వాహనాలు దూసుకొస్తుండగా కొంత దూరంలో ఉన్న సెక్యూరిటీ చెక్‌ పాయింట్ గేట్లు ఎత్తేందుకు గార్డులు పరుగెత్తడం వీడియోలో కనిపించింది

Video Viral: Woman does Aerobics as the military vehicles in Myanmar rush towards parliament

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు కాగానే కొన్ని మిలియన్ సంఖ్యలో లైక్స్ వచ్చాయి. 2020లో ఇదే అత్యుత్తమ వీడియో అవుతుందని కొందరు నెటిజెన్లు కామెంట్లు సైతం చేశారు. మొత్తం మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను తన ఫేస్‌బుక్‌ పేజ్ పై ఖింగ్ పోస్టు చేసింది. ఆ తర్వాత అదే ప్రాంతంలో అంతకు మునుపు చేసిన ఏరోబిక్స్ వీడియోస్‌ను కూడా ఖింగ్ పోస్టు చేసింది. గత 11 నెలలుగా పార్లమెంటు ఎదురుగా వీడియోలు చేసుకొస్తున్నట్లు చెప్పుకొచ్చింది ఖింగ్.

ఇదిలా ఉంటే ఏడాది పాటు మయన్మార్ దేశాన్ని తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు మిలటరీ వర్గాలు ప్రకటించగానే ఆదేశంలో అలజడి నెలకొంది. స్టేట్ కౌన్సిలర్ సుకీతో పాటు ఇతర ప్రముఖ నాయకులను మిలటరీ అరెస్టు చేసి నిర్బంధించింది. ఈ ఘటనను పలువురు ప్రపంచ దేశాల నాయకులు కూడా ఖండించారు. ఒక ఏడాది పాటు కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లాంగ్ నియంత్రణలో దేశం ఉంటుందని మిలటరీ వర్గాలు నిర్వహిస్తున్న టీవీ ఛానెల్స్ కథనంను ప్రసారం చేశాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించకపోవడంపై మిలటరీ చర్య తప్పడం లేదని కథనాలు ప్రసారం చేశాయి.

  India China Stand Off : దక్షిణ సరిహద్దు Myanmar వెంట 2000 కిమీ పొడవైన గోడను నిర్మించిన China

  English summary
  Avideo of a Woman who did her regular Aerobics while the Military Coup was taking place in the background went viral on social media.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X