వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ సహా ఎన్నో ప్రత్యేకం: మాల్యాను ఉంచే జైల్లో సౌకర్యాలు, లండన్ కోర్టుకు వీడియో

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్/ముంబై: బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను భారత్ రప్పిస్తే ఆయనను ఉంచనున్న జైలుకు సంబంధించిన వీడియోను సీబీఐ అధికారులు బ్రిటన్ కోర్టుకు పంపించారు. ఆర్థర్ రోడ్డు జైలులోని బ్యారెక్ నంబరు 12ను భద్రత కారణాల దృష్ట్యా హై ప్రొఫైల్‌ ఖైదీల కోసం ఉపయోగిస్తారు.

విజయ్ మాల్యాను భారత్‌కు తరలిస్తే ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు నెంబర్ 12 బ్యారెక్‌లో ఉంచనున్నారు. ఇందులో ఉన్న సదుపాయాలను సీబీఐ అధికారులు వీడియో తీశారు. అందులో టీవీ, వ్యక్తిగత వెస్ట్రన్ టాయిలెట్, బెడ్, వాషింగ్ ప్రాంతం, గాలి, వెలుతురు ఉండేలా విశాల ప్రాంతం ఉన్నాయి.

 6 నుంచి 8 నిమిషాల నిడివి గల వీడియో

6 నుంచి 8 నిమిషాల నిడివి గల వీడియో

ఈ జైలులోని సదుపాయాలను చూపిస్తూ సీబీఐ వీడియో తీసింది. దీనిని లండన్ కోర్టుకు పంపించింది. ఈ వీడియో ఆరు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాలు ఉంది. జైలులో ఉన్న సదుపాయాలను హైలెట్ చేస్తూ ఈ వీడియో పంపించారు.

జైలు గది వీడియో పంపిండి: బ్రిటన్ కోర్టు, మాల్యాను రప్పించేప్రక్రియ కొలిక్కి!జైలు గది వీడియో పంపిండి: బ్రిటన్ కోర్టు, మాల్యాను రప్పించేప్రక్రియ కొలిక్కి!

మాల్యా జైలు గది ఇలా ఉంది

మాల్యా జైలు గది ఇలా ఉంది

మాల్యాను ఉంచే జైలు ఎలా ఉంటుందో తమకు కావాలని బ్రిటన్ కోర్టు అడిగిందని, దీంతో తాము ఆధారంగా ఈ వీడియోను పంపించామని, జైల్లో మెడిసిన్స్ సహా అన్ని వసతులు ఉన్నాయని, ఈ జైలు గది తూర్పు ముఖం ఉందని, కాబట్టి వెళుతురు కూడా బాగా వస్తుందని ఓ సీనియర్ జైలు అధికారి వెల్లడించారు. బయట నడిచేందుకు స్థలం ఉందన్నారు.

 అంతర్జాతీయ ప్రమాణాలతో

అంతర్జాతీయ ప్రమాణాలతో

ఈ జైలులోకి వెళుతురు బాగా వస్తుందని, వెంటిలేషన్ కోసం కిటికీలు ఉన్నాయని అధికారులు చెప్పారు. కోర్టు యార్డులోకి వెళ్లే విధంగా కూడా ఉందని తెలిపారు. లైబ్రరీ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. జైలు ప్రమాణాలు అంతర్జాతీయస్థాయిలో ఉన్నాయన్నారు. గతంలో పలుమార్లు జరిగిన విచారణ సందర్భంగా కూడా ఈ విషయాన్ని కోర్టుకు తెలిపామన్నారు.

అదనపు సెక్యూరిటీ, సీసీ కెమెరాలు

అదనపు సెక్యూరిటీ, సీసీ కెమెరాలు

ఈ సెల్ వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయని, అదనంగా సెక్యూరిటీ గార్డులను ఇరువైపుల ఉంచుతామని, బ్యారెక్ లోపల, బయట ఇరవై నాలుగు గంటలు సెక్యూరిటీ ఉంటుందని వెల్లడించారు. రోజుకు నాలుగుసార్లు భోజనం ఉంటుందన్నారు. భారతీయ జైళ్లలో వెళుతురు, సరైన గాలి ఉండదని విజయ్ మాల్యా బ్రిటన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో విజయ్ మాల్యాను ఉంచే జైలుకు సంబంధించిన వీడియోను పంపించాలని బ్రిటన్ కోర్టు ఇండియన్ అధికారులకు సూచించింది.

English summary
A television set, personal toilet and bedding, a washing area and a courtyard to take a stroll in the sunlight are just some of the highlights of Barrack Number 12 of Mumbai's Arthur Road Jail, the prospective residence of fugitive tycoon Vijay Malaya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X