వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను మోసగాడ్ని కాదు, అంతా అబద్దం: విజయ్ మాల్యా, లండన్ కోర్టులో ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: భారత్‌లోని బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. అనంతరం విచారణను సెప్టెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. విచారణ నిమిత్తం ఆయన వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. అతను తన కొడుకు సిద్ధార్థతో పాటు వచ్చాడు.

బ్యాంకులతో సెటిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని విజయ్ మాల్యా చెప్పారు. తనపై మనీ లాండరింగ్ ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆయన మంగళవారం లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ కోర్టుకు హాజరయ్యారు. తనను మోసగాడు అనవద్దన్నాడు. విచారణకు హాజయ్యేందుకు వచ్చిన ఆయన కోర్టు బయట మీడియాతో మాట్లాడారు.

Vijay Mallya extradition trial: London court grants bail to liquor baron; next hearing on 12 September

అన్ని విధాలుగా సెటిల్ చేసుకోవడానికి అంగీకారం చెబుతూ కర్ణాటక కోర్టుకు తెలిపానని మాల్యా చెప్పాడు. రూ.14వేల కోట్ల రూపాయల ఆస్తులను కోర్టు ముందు ఉంచానని చెప్పారు. వాటిని అమ్మవచ్చునని కూడా చెప్పానని తెలిపాడు. వాటిని అమ్మి చెల్లించడం ద్వారా బ్యాంకులు అన్నీ సంతోషిస్తాయన్నాడు. కానీ తాను మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాననే ఆరోపణలు సరికాదన్నాడు.

English summary
Embattled liquor tycoon Vijay Mallya, who returned to Westminister Magistrates' Court today for closing arguments in his high-profile extradition trial has been granted bail. The court also fixed the next hearing on September 12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X