వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెడీ 1,2,3.. 28 రోజుల్లోపు భారత్‌కు విజయ్ మాల్యా, పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు..

|
Google Oneindia TeluguNews

లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు లండన్ హైకోర్టులో చుక్కెదురైంది. భారతదేశానికి అప్పగించే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాననే పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో బ్రిటన్‌లో విజయ్ మాల్యాకు న్యాయపరంగా ఉన్న దారులు మూసుకుపోయినట్లయ్యింది. 28 రోజులలోపు మాల్యాను భారత్ అప్పగించే ప్రక్రియను బ్రిటన్ హోంశాఖ చేపట్టబోతోంది.

Recommended Video

Vijay Mallya to be Extradited to India Within 28 days
11 వేల కుచ్చుటోపి..

11 వేల కుచ్చుటోపి..

బ్యాంకులకు రూ.11 వేల కుచ్చుటోపి పెట్టి పారిపోయిన విజయ్ మాల్యా లండన్‌లో కనిపించారు. అతనిని తమకు అప్పగించాలని భారత్ దరఖాస్తు చేసుకుంది. దీంతో తనకు న్యాయపరంగా ఉన్న హక్కులను ఉపయోగించుకున్నారు. కానీ అతని చేసిన మోసాలను బ్రిటన్ కోర్టులు తప్పుపట్టాయి. కింది కోర్టు నుంచి హై కోర్టు వరకు మాల్యాకు చుక్కెదురైంది. ఇటీవల హైకోర్టు కూడా భారత్ అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. ఆ తీర్పును సవాల్ చేసేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. అయితే పై కోర్టుకు వెళ్లే పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టివేసింది. దీంతో లండన్‌లో నక్కి ఉన్న లిక్కర్ బ్యారన్ ఇండియా రాక తప్పని పరిస్థితి నెలకొంది.

28 రోజుల్లోపు..

28 రోజుల్లోపు..

మాల్యాను భారత్ అప్పగించే పేపర్ల బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి 28 రోజుల్లోపు సంతకం చేస్తారు. ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే అతనిని ఇండియా తరలించే ఏర్పాటు చేస్తారు. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరుతో బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్ల రుణాన్ని మాల్యా తీసుకున్నారు. అదీ వడ్డీలతో కలిపి రూ.11 వేల కోట్లకు చేరింది.
రుణం తీసుకొని పారిపోయిన మాల్యా.. 2016లో బ్రిటన్‌లో కనిపించారు.

900 కోట్లే..

900 కోట్లే..


కుట్ర, మనీ ల్యాండరింగ్ కేసులను భారత ప్రభుత్వం నమోదు చేసింది. అయితే మాల్యా మాత్రం తాను రూ.900 కోట్లు మాత్రమే రుణం తీసుకున్నానని.. రూ.9 వేల కోట్లు కాదని చెబుతున్నారు. 2009లో ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణం తీసుకున్నానని పేర్కొన్నాడు. మాల్యాపై సీబీఐ, ఈడీ ముంబైలో కేసు నమోదు చేశాయి. ఆ పత్రాలను బ్రిటన్ ప్రభుత్వానికి కూడా సమర్పించాయి. అక్కడి కోర్టుల్లో మాల్యాకు చుక్కెదురు కావడంతో.. 28 రోజుల్లోపు ఇండియా రావాల్సిన పరిస్థితి నెలకొంది.

English summary
Fugitive businessman Vijay Mallya on Thursday lost a plea seeking that he be allowed to appeal against his court-ordered extradition to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X