వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టుకు మాల్యా: హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్న లిక్కర్ బ్యారన్..

|
Google Oneindia TeluguNews

బ్యాంకులకు రూ.9 వేల కోట్ల ఎగనామం పెట్టి లండన్‌లో నక్కిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా.. యూకే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. భారత బ్యాంకులను మోసం చేసిన కేసులో తమకు అప్పగించాలని ఇండియా యూకే ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి కోర్టులో పిటిషన్ వేసిన మాల్యాకు చుక్కెదురైంది. మాల్యాను భారత్ అప్పగించేందుకు హైకోర్టు అంగీకరించడంతో.. సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మాల్యా భావిస్తున్నాడు.

 Vijay Mallya Seeks To Approach UK Supreme Court..

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ పేరుతో బ్యాంకుల నుంచి రూ.9 వేల కోట్ల రుణాన్ని మాల్యా తీసుకున్నారు. దీనిపై యూకే హైకోర్టులో భారత్‌కు అనుకూలంగా తీర్పువచ్చింది. భారత్‌కు అప్పగించాలని హైకోర్టు స్పష్టంచేయడంతో.. దానిని సవాల్ చేసేందుకు మాల్యాకు 14 రోజుల సమయం ఉంది. సుప్రీంకోర్టు మెట్లెక్కి తప్పించుకోవాలని చూస్తున్నారు. కేసు సుప్రీంకోర్టుకు చేరనుండటంతో ఫలితం కోసం యూకే హోం మంత్రిత్వశాఖ చూస్తోంది. వాస్తవానికి మే 14వ తేదీ వరకు అప్పీల్ చేసుకునే సమయం మాల్యాకు ఉంది. సుప్రీం తీర్పును బట్టి యూకే హోంశాఖ చర్యలు తీసుకోనుంది,

Recommended Video

Ravichandran Ashwin & Hanuma Vihari Chit Chat About Telugu Movies

బ్యాంకుల నుంచి రుణం తీసుకొని పారిపోయిన మాల్యా.. 2016లో బ్రిటన్‌లో కనిపించారు. కుట్ర, మనీ ల్యాండరింగ్ కేసులను భారత ప్రభుత్వం నమోదు చేసింది. అయితే మాల్యా మాత్రం తాను రూ.900 కోట్లు మాత్రమే రుణం తీసుకున్నానని.. రూ.9 వేల కోట్లు కాదని చెబుతున్నారు. 2009లో ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.900 కోట్ల రుణం తీసుకున్నానని పేర్కొన్నాడు.

English summary
Business tycoon Vijay Mallya has sought permission to appeal in the United Kingdom Supreme Court, days after he lost a petition in the London High Court against his extradition to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X