వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్‌ను గజగజ వణికించిన తెలుగు మహిళ గద్దె విజయ: ఆమె దెబ్బకు ట్విట్టర్ అకౌంట్ క్లోజ్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ భవనం.. కేపిటల్ బిల్డింగ్‌పై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఆయన ట్విట్టర్ అకౌంట్‌కు శాశ్వత నిషేధానికి దారి తీశాయి. తరచూ వివాదాస్పద పోస్టులు చేస్తూ ట్విట్టర్‌ యాజమాన్యం నుంచి హెచ్చరికలను అందుకున్నప్పటికీ.. డొనాల్డ్ ట్రంప్ తన తీరు మార్చుకోలేదు. కేపిటల్ బిల్డింగ్‌పై దాడి చోటు చేసుకున్న సమయంలోనూ ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు, తన మద్దతుదారులను మరింత రెచ్చగొట్టేలా వీడియోలను ఆయన పోస్ట్ చేశారు.

అత్యంత అరుదుగా..

అత్యంత అరుదుగా..

ఫలితంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ శాశ్వతంగా క్లోజ్ అయిపోయింది. ఇక ఎప్పుడూ ట్విట్టర్‌ను వినియోగించుకోలేని విధంగా శాశ్వత నిషేధాన్ని విధించింది. ఒక దేశాధ్యక్షుడు వినియోగించే మైక్రో బ్లాగింగ్ అకౌంట్ శాశ్వతంగా లాక్ కావడం అనేది అత్యంత అరుదైన ఘటనల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఇప్పటిదాకా- అమెరికా అధ్యక్షుడే కాదు.. ఏ దేశాధినేత కూడా ఇలాంటి పరిణామాలను ఎదుర్కొనలేదు. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ శాశ్వతంగా క్లోజ్ కావడంతో.. అత్యధిక ఫాలోవర్లు ఉన్న అధ్యక్షులు, ప్రధానమంత్రుల జాబితాలో నరేంద్ర మోడీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చారు.

తుది నిర్ణయం ఆమెదే..

తుది నిర్ణయం ఆమెదే..

డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను శాశ్వతంగా నిషేధించాలంటూ ఆ సంస్థ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వెనుక.. ఓ తెలుగు మహిళ ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఆమె పేరు విజయ గద్దె (Vijaya Gadde). వయస్సు 45 సంవత్సరాలు. ఆమె పూర్వీకులు తెలుగు వారేనని తెలుస్తోంది. ట్విట్టర్ సంస్థలో టాప్ పాలసీ మేకర్‌గా పనిచేస్తున్నారు. ట్విట్టర్ లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ విభాగానికి విజయ గద్దె టీమ్ లీడర్. వాషింగ్టన్‌లో చెలరేగిన హింసాత్మక పరిస్థితులను మరింత ప్రోత్సహించేలా డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న పోస్టులు ఉన్నాయనే కారణంతో- తొలుత 12 గంటల పాటు.. ఆ తరువాత శాశ్వతంగా ట్విట్టర్ అకౌంట్‌ను నిషేధిస్తూ నిర్ణయాలను తీసుకున్నారు.

ప్రొఫెషనల్ అడ్వొకేట్‌గా

ప్రొఫెషనల్ అడ్వొకేట్‌గా

విజయ గద్దె.. వృత్తిపరంగా న్యాయవాది. ట్విట్టర్‌లో భద్రతాపరమైన నిర్ణయాలు, విధానాల రూపకర్త. 350 మంది సిబ్బంది పనిచేసే ట్విట్టర్ లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ విభాగాన్ని ఆమె లీడ్ చేస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా ట్విట్టర్‌లో పోస్ట్ అయ్యే వ్యాఖ్యానాలు, వీడియోలకు కళ్లెం వేయాల్సిన బాధ్యత ఈ విభాగానిదే. ట్విట్టర్ యూజర్ల వ్యక్తిగత భద్రత మొదలుకుని.. వారు చేసే కామెంట్లను పర్యవేక్షించే టీమ్ కావడం వల్ల.. మొత్తం మైక్రో బ్లాగింగ్ సైట్‌లో ఇదే కీలకంగా భావిస్తుంటారు.

ఇక్కడే జన్మించి..

ఇక్కడే జన్మించి..


విజయ గద్దె భారత్‌లోనే జన్మించారు. ఆమెకు మూడేళ్ల వయస్సున్నప్పుడు తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లిపోయారు. టెక్సాస్‌లోని బ్యూమౌంట్‌లో స్థిరపడ్డారు. కార్నెల్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ లేబర్ రిలేషన్స్, న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లాలో చదువుకున్నారు. 2011లో ట్విట్టర్‌ సంస్థలో చేరారు. క్రమంగా టీమ్ లీడ్‌గా ఎదిగారు. కార్పొరేట్ అడ్వొకేట్‌గా, పాలసీ మేకర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు సిలికాన్ వ్యాలీలోని కొన్ని అమెరికన్ స్టాఫ్‌వేర్ కంపెనీల్లో లీగల్ అడ్వైజర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె శాన్‌ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు.

ప్రపంచాన్ని మార్చేయగల 50 మంది మహిళ జాబితాలో చోటు..

ప్రపంచాన్ని మార్చేయగల 50 మంది మహిళ జాబితాలో చోటు..

ఇన్‌స్లైల్ మేగజైన్ నిర్వహించిన సర్వేలో.. ప్రపంచాన్ని మార్చి వేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న తొలి 50 మంది మహిళల జాబితాలో విజయ గద్దె చోటు సంపాదించారు. ట్విట్టర్‌లో పనిచేస్తూనే.. సొంతంగా గద్దె ఏంజెల్స్ అనే పబ్లిక్ రిలేషన్ స్టార్టప్‌ను నెలకొల్పారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను నిషేధించడం వెనుక కీలక పాత్ర పోషించడంతో ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఓ దేశాధినేత ట్విట్టర్ అకౌంట్‌పై వేటు వేసిన మహిళగా వార్తల్లో నిలిచారు.

English summary
A 45-year-old immigrant from India and Twitter's top lawyer, Vijaya Gadde, spearheaded the decision to permanently suspend US President Donald Trump's Twitter accounts. On Friday, the tech giant blocked Donald Trump's Twitter handles for the first time, finally escalating its crackdown on the president's social media posts that they believe encouraged and supported rioters at the US Capitol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X