వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్షుడిగా మైక్ పెన్స్: ట్రంప్ ఉద్వాసన?: 25వ సవరణ: జాన్ ఎఫ్ కెనడీ హయాంలో: తిరుగుబాటు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో అధికార మార్పిడికి గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ అనూహ్య పరిణామాలు నెలకొంటున్నాయి. రాజకీయ వాతావరణం శరవేగంగా మారిపోతోంది. గత ఏడాది నిర్వహించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన అనంతరం.. అధికారం నుంచి తప్పుకోవడానికి డొనాల్డ్ ట్రంప్.. బెట్టు చేస్తోన్న నేపథ్యంలో.. ఆయనను ఉద్వాసన పలకడానికి సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. 25వ చట్ట సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించే అవకాశాన్ని అక్కడి కేబినెట్ పరిశీలిస్తోంది. ఈ కేబినెట్‌కు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ సారథ్యాన్ని వహించనున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

2020 Big Event : Namaste Trump హౌడీ మోడీ- నమస్తే ట్రంప్.. ఢిల్లీ అల్లర్ల సమయంలోనే ట్రంప్ పర్యటన !

సెనెట్‌లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు: నేషనల్ గార్డుల ఆధీనంలో వాషింగ్టన్సెనెట్‌లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు: నేషనల్ గార్డుల ఆధీనంలో వాషింగ్టన్

సమావేశాలను అడ్డుకున్న నేపథ్యంలో..

సమావేశాలను అడ్డుకున్న నేపథ్యంలో..

అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికైనట్లు ఆ దేశ పార్లమెంట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో.. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఏకంగా ముట్టడికి దిగిన అనంతరం అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అత్యున్నత చట్టసభ భేటీని అడ్డుకోవడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఓటమి, జో బిడెన్ విజయాన్ని అధికారికంగా ఆమోదించలేకపోతోన్నందున అమెరికా కేబినెట్.. కొన్ని కీలక, కఠిన నిర్ణయాలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది

ట్రంప్ ఉద్వాసన

ట్రంప్ ఉద్వాసన

డొనాల్డ్ ట్రంప్‌కు ఉద్వాసన పలకాలనే అభిప్రాయం.. ఆయన సొంత కేబినెట్‌లోనే వ్యక్తమౌతోంది. ట్రంప్ కేబినెట్ మంత్రులే ఆయన పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. తిరుగుబాటును లేవదీయడానికి సన్నాహాలు చేపట్టారు. అత్యంత ప్రతికూల పరిస్థితులకు కారణమైన సమయంలో ఏకంగా అధ్యక్షుడిని సైతం ఉద్వాసన పలకడానికి ఉద్దేశించిన చట్ట సవరణను డొనాల్డ్ ట్రంప్‌పై ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేబినెట్ మంత్రులు తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. అనంతరం దీన్ని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆమోదించాల్సి ఉంది.

ఏమిటా 25వ చట్ట సవరణ..

ఏమిటా 25వ చట్ట సవరణ..

అధ్యక్షుడు అర్ధాంతరంగా కన్నుమూసినా, దేశ ప్రజల్లో తిరుగుబాటు తరహా పరిస్థితులు నెలకొన్నా.. కొత్త నాయకుడిని అధ్యక్ష స్థానానికి ఎన్నుకోవడానికి ఉద్దేశంచిన చట్ట సవరణ ఇది. అమెరికా చరిత్రలో ఒకట్రెండు సార్లు మాత్రమే దీన్ని ప్రయోగించినట్లు చెబుతున్నారు. ఇదివరకు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైన సమయంలో ఈ చట్ట సవరణను తెర మీదికి తీసుకొచ్చింది యూఎస్ సెనెట్. జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైన తరువాత.. ఆయన స్థానంలో మరొకరిని అధ్యక్షుడిగా నియమించడానికి అప్పట్లో చట్టాన్ని సవరించారు. 25వ చట్ట సవరణగా ఇది గుర్తింపు పొందింది.

ఉపాధ్యక్షుడికి అధ్యక్ష బాధ్యతలు..

ఉపాధ్యక్షుడికి అధ్యక్ష బాధ్యతలు..

అధ్యక్షుడిగా ఎన్నికైన నాయకుడిని అర్ధాంతరంగా ఉద్వాసన పలికిన అనంతరం.. ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేసే బాధ్యతను ఉపాధ్యక్షుడికి దక్కుతుంది. ఈ మేరకు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైన సమయంలో అప్పటి ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడిని చేశారు. దీనికోసం చట్టాన్ని సవరించారు. అమెరికా చట్టాన్ని సవరించడం అది 25వ సారి. అదే 25వ చట్ట సవరణను తాజాగా డొనాల్డ్ ట్రంప్‌పైకి ప్రయోగించడానికి సన్నాహాలు సాగుతున్నాయి. అదే జరిగితే.. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నియమితులు అవుతారు. మిగిలిన ఈ కొద్దిరోజుల పదవీ కాలాన్ని ఆయన భర్తీ చేస్తారు.

English summary
Following a violent riot at the U.S. Capitol involving supporters of President Donald Trump, some politicians have called for the impeachment of the outgoing president. Others have called for Vice President Mike Pence to use the 25th Amendment to remove Trump from power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X