వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ చుట్టూ ఉచ్చు: మెలానియాను తాకిన వాషింగ్టన్ అల్లర్ల సెగ: ఖాళీ అవుతోన్న వైట్‌హౌస్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులు పతాక స్థాయికి చేరుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఆ దేశ పార్లమెంట్ భవనాన్ని ముట్టడించిన తరువాత.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించడం, సమావేశాలను భగ్నం చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్న ప్రభావం వైట్‌హౌస్‌పై పడింది. అమెరికా అధ్యక్ష భవనం ఖాళీ అవుతోంది. కీలక స్థానాల్లో ఉన్న అధికారులు రాజీనామాల బాట పట్టారు.
అనూహ్యంగా పరిణామాలతో డొనాల్డ్ ట్రంప్ క్యాంప్.. ఉక్కిరిబిక్కిరికి గురవుతోంది. ఉద్వాసన ఉచ్చు బిగుసుకుంటోంది.

అమెరికా అధ్యక్షుడిగా మైక్ పెన్స్: ట్రంప్ ఉద్వాసన?: 25వ సవరణ: జాన్ ఎఫ్ కెనడీ హయాంలో: తిరుగుబాటుఅమెరికా అధ్యక్షుడిగా మైక్ పెన్స్: ట్రంప్ ఉద్వాసన?: 25వ సవరణ: జాన్ ఎఫ్ కెనడీ హయాంలో: తిరుగుబాటు

తాజాగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు వాషింగ్టన్ అల్లర్ల సెగ తగిలింది. ఆమె కార్యాలయాల్లో వేర్వేరు విభాగాల్లో పనిచేసే ఉన్నతాధికారులు ఒక్కరొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. మెలానియా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టెఫానీ గ్రీషం రాజీనామా చేశారు. ఆమె వైట్‌హౌస్ సోషల్, ప్రెస్ సెక్రెటరీగా కూడా పనిచేస్తున్నారు. వాషింగ్టన్‌లో అల్లర్లు చోటు చేసుకున్న కొన్ని నిమిషాల వ్యవధిలోనే స్టెఫానీ తన హోదాకు గుడ్‌బై చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల చర్యలకు నిరసనగా ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

Violence at US Capitol: Melanias chief of staff and White House social secretary resign

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసంలో ఇన్నాళ్లు పనిచేయడం.. తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ఆమె వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ హయాంలో వైట్‌హౌస్‌లో కీలక పదవిలో కొనసాగడం తనకు గర్వకారణమని చెప్పారు. వారి సారథ్యంలో తాను చిన్నపిల్లలకు మెరుగైన ప్రమాణాలను కల్పించడానికి కృషి చేశానని పేర్కొన్నారు. కొన్ని కారణాల వల్ల రాజీనామా చేయాల్సి వస్తోందని చెప్పారు. ఆ కారణాలేమిటనేది స్టెఫానీ వివరించలేదు. వాషింగ్టన్‌లో అల్లర్లు చెలరేగిన కాస్సేపటికే హోదా నుంచి వైదొలగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Recommended Video

US Senate passed High-Skilled Immigrants Act Bill, huge relief to Indian IT Professionals

2016లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తొలి రోజుల్లోనే ఆమె వైట్‌హౌస్‌లో చేరారు. అప్పటి నుంచి మెలానియా ట్రంప్.. చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, వైట్‌హౌస్ సోషల్, ప్రెస్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. గత ఏడాది ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆమె డొనాల్డ్ ట్రంప్ తరఫున ఎన్నికల ర్యాలీల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ప్రెస్ సెక్రెటరీగా వ్యవహరించినప్పటికీ.. ఇప్పటిదాకా ఆమె విలేకరుల భేటీని ఏర్పాటు చేయలేదు. పూర్తి సమయాన్ని మెలానియా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌ హోదాకే కేటాయించారు.

English summary
The first lady's top aide and former White House Press Secretary Stephanie Grisham has resigned amid ongoing chaos in the nation's capital over the 2020 election results. She announced her departure as the nation reeled from harrowing scenes at the U.S. Capitol on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X